Article 370 : ఆసక్తికరంగా సాగిన ‘ఆర్టికల్ 370’ ట్రైలర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి యామి గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆర్టికల్ 370’. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఎత్తివేత ప్రధాన అంశంగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది.ఆదిత్య సుహాస్ జంబాలే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 23వ తేదీన ఆర్టికల్ 370 చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో నేడు (ఫిబ్రవరి 8) ట్రైలర్ రిలీజ్ అయింది.ఆర్టికల్ 370 చిత్రంలో యామీ గౌతమ్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ పాత్ర పోషించారు. కశ్మీర్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత, ఘర్షణలు మరియు అవినీతిపై ఆమె పోరాడుతుంటారు. జము కశ్మీర్‌కు ఉన్న ఆర్టికల్ 370 ప్రత్యేక స్టేటస్ వల్ల ఆమె విధులకు ఆటంకం ఏర్పడుతుంటుంది. ఘర్షణలను అరికట్టేందుకు కూడా ఈ అధికరణ ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అయితే, ఆర్టికల్ 370 అధికరణను ప్రభుత్వం ఎత్తేయాలని నిర్ణయించే క్రమంలో జరిగిన ప్రక్రియను కూడా ట్రైలర్లో మేకర్స్ చూపించారు.
కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ఎత్తేయడం, ఆ తర్వాత పరిణామాలు కూడా ట్రైలర్లో చూపించారు.. “మొత్తం కశ్మీర్.. భారత దేశంలో అంతర్భాగమే.. ఎప్పటికీ అలాగే ఉంటుంది” అనే డైలాగ్‍తో ట్రైలర్ ముగిసింది. 2 నిమిషాల 43 సెకన్లు ఉన్న ఆర్టికల్ 370 ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా, థ్రిల్లింగ్‍గా సాగింది.ఆర్టికల్ 370 చిత్రంలో ప్రియమణి, వైభవ్, తత్వవాది, అరుమ్ గోవిల్, రాజ్ అరుణ్, స్కంద ఠాకూర్, అశ్విన్ కౌల్, కిరణ్ కర్మాకర్, దివ్య సేత్ షా, రాజ్ జుత్షి, సుమిత్ కౌల్, గోపినాథ్ మరియు అశ్విని కుమార్ కీలపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఆదిత్య ధార్ మరియు లోకేశ్ ధార్ నిర్మించగా శష్వాంత్ సచ్‍దేవ్ సంగీతం అందించారు. ట్రైలర్లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 23న థియేటర్లలోకి రానుంది.భారత దేశ చరిత్రలో ఎంతో ముఖ్యమైన విషయాన్ని ఈ చిత్రంలో తాము చూపించామని దర్శకుడు ఆదిత్య సుహాస్ చెప్పారు. రాజకీయ అంశంతో పాటు యాక్షన్ కూడా ఈ చిత్రంలో ఉంటుందని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో ఆయన తెలిపారు.
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
తాజావార్తలు
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!