NTV Telugu Site icon

Bihar: యువకుడిని చెప్పుదెబ్బ కొట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. కోపంతో ఏం చేశాడంటే..!

Bihar

Bihar

బీహార్‌లోని దర్భంగాలో హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడిపై మహిళా పోలీసు అధికారి లాఠీచార్జి చేసింది. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా భాగల్‌పూర్‌లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్ పై వెళ్తున్న వ్యక్తిని చెప్పుతో చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువకుడు కానిస్టేబుల్‌తో గొడవ పడి.. కానిస్టేబుల్ యూనిఫాం చించేశాడు. తనను ఎందుకు చెప్పుతో కొట్టావని ఆ యువకుడు పదే పదే అడిగాడు. నన్ను చెంపదెబ్బ కొట్టే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. భాగల్‌పూర్‌ కలెక్టరేట్‌లోని కచారి చౌక్‌లో తనిఖీలు చేస్తున్న సమయంలో ట్రాఫిక్‌లో మోహరించిన పోలీసులతో ఓ యువకుడు గొడవకు దిగాడు.

Rs.2000 Notes: రేపే చివరి రోజు.. ఆ తర్వాత 2వేల నోట్లు కనపడవు!

వివరాల్లోకి వెళ్తే.. యువకుడి బైక్ పై ఉన్న పెండింగ్‌ చలాన్ల విషయంలో ఈ ఘర్షణకు దారి తీసింది. అతని బైక్ పై చలాన్లు జారీ చేసిన కొన్ని గంటల తర్వాత ట్రాఫిక్ కానిస్టేబుల్ అమలేష్ కుమార్‌ దగ్గరకు వచ్చి దుర్భాషలాడాడు. దీంతో కానిస్టేబుల్ ఆ యువకుడిని చెప్పుతో కొట్టాడు. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు కానిస్టేబుల్‌తో గొడవకు దిగి యూనిఫాం చింపేశాడు. ఈ ఘటనలో యువకుడి చొక్కా కూడా చిరిగిపోయింది. అయితే వారిద్దరికి మధ్య జరిగిన గొడవ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Asian Games 2023: షాట్‌పుట్‌లో కిరణ్ బలియన్కు కాంస్యం

ఈ ఘటనపై సీనియర్ అధికారికి సమాచారం అందడంతో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బ్రజేష్ కుమార్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని జోగ్‌సర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాలని ఉందని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బ్రిజేష్ కుమార్ తెలిపారు. అయితే యువ‌కుడిని చెప్పుతో కొట్టడం, పోలీసుల‌తో వాగ్వాదం చేయ‌డం.. యూనిఫాం చింపివేయడం చర్చనీయాంశంగా మారడంతో ట్రాఫిక్ పోలీసుల వ్యవహార శైలిపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.