కర్నాటకలోని ఉడిపిలో టైరు పగిలి మెకానిక్ గాల్లోకి ఎగిరిపడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన ఉన్న టైర్ షాప్ మెకానిక్ స్కూల్ బస్సు టైర్‌ని పంచర్ వేసి గాలి నింపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే టైరు పేలింది. దీంతో.. అక్కడే ఉన్న మెకానిక్ గాల్లో ఎగిరిపడ్డాడు. ఈ క్రమంలో మెకానిక్ అబ్దుల్ రజీద్ (19)కు గాయాలయ్యాయి. ఈ ఘటన ఈనెల 21న జరిగింది.
Read Also: Mythri Movie Makers: శ్రీ తేజ్ కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ 50 లక్షల ఆర్థిక సాయం
ఓ స్కూల్ బస్సుకు చెందిన టైరులో గాలి నింపాడు. అయితే.. ప్రమాదవశాత్తు టైర్ పగలడంతో క్షణాల్లో పేలిపోయింది. టైరు బలంగా పేలడంతో మెకానిక్ అబ్దుల్ చేతికి గాయమైంది. దీంతో.. స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియాలో ఈ దృశ్యానికి సంబంధించి చూడవచ్చు. షాప్ ముందు పార్క్ చేసిన “బేరీస్ సీసైడ్ పబ్లిక్ స్కూల్” పాఠశాల బస్సు టైర్‌ను రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ముందుగా.. మెకానిక్ టైరులో గాలి నింపి నిలబడ్డాడు.. ఆ తర్వాత గాలి నింపి వెళ్ళిపోతున్న కొద్ది సెకన్లలోనే టైరు పేలింది.
Read Also: Deputy CM Pawan Kalyan: క్షేత్రస్థాయిలో పవన్ కల్యాణ్ పర్యటన.. రోడ్డు తవ్వి మరీ నాణ్యత పరిశీలన..!
గతంలో కూడా టైరు పగిలిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో కర్ణాటకలోని ఉడిపిలో చేపలను తీసుకెళ్తున్న టెంపో టైరు పగిలింది. ఈ ఘటనలో వాహనం బోల్తా పడి అందులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. మళ్లీ అదే మార్గంలో ఎన్ హెచ్ 66లో టైరు పగిలిన ఘటన చోటుచేసుకుంది.
ಪಂಚರ್ ಶಾಪ್ ಒಂದರಲ್ಲಿ ಟೈರಿಗೆ ಗಾಳಿ ತುಂಬುವ ಸಂದರ್ಭ ಟೈರ್ ಸಿಡಿದು ಸ್ಪೋಟಗೊಂಡು ಯುವಕ ಗಂಭೀರ ಗಾಯಗೊಂಡ ಘಟನೆ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಕುಂದಾಪುರ ಬಳಿ ನಡೆದಿದೆ. ಕೋಟೇಶ್ವರದಲ್ಲಿ ಈ ಘಟನೆ ನಡೆದಿದ್ದು, ಗಂಭೀರ ಗಾಯಗೊಂಡ ಯುವಕ ಅಬ್ದುಲ್ ರಜೀದ್ (19) ಎಂದು ಗುರುತಿಸಲಾಗಿದೆ. ಘಟನೆ ಸಿಸಿಟಿವಿಯಲ್ಲಿ ಸೆರೆಯಾಗಿದೆ. @VisitUdupi @UdupiPolice pic.twitter.com/Zf10Ubwt1g
— eedina.com ಈ ದಿನ.ಕಾಮ್ (@eedinanews) December 23, 2024