కర్నాటకలోని ఉడిపిలో టైరు పగిలి మెకానిక్ గాల్లోకి ఎగిరిపడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన ఉన్న టైర్ షాప్ మెకానిక్ స్కూల్ బస్సు టైర్‌ని పంచర్ వేసి గాలి నింపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే టైరు పేలింది. దీంతో.. అక్కడే ఉన్న మెకానిక్ గాల్లో ఎగిరిపడ్డాడు. ఈ క్రమంలో మెకానిక్ అబ్దుల్ రజీద్ (19)కు గాయాలయ్యాయి.