Mulugu: చల్పాక ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలు.. అన్నంలో విషప్రయోగం..!
- చల్పాక ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలు..
- అన్నంలో విషప్రయోగం జరిగినట్టు సమాచారం: గుత్తి కోయలు
- ఉదయం ఏడుగురు మావోయిస్టులు మృతి.
ములుగు జిల్లా చల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలంలో రెండు ఏకే-47 రైఫిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Hyderabad: గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
కాగా.. ఈ ఎన్కౌంటర్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్ పై పలు అనుమానాలు ఉన్నాయని.. అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజలు వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. చనిపోయిన ఏడుగురి మావోయిస్టు మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్షలు నిర్వహించాలని.. అలాగే ఎన్కౌంటర్ పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.
Read Also: Upcoming Smart Phones: డిసెంబర్ నెలలో రాబోయే టాప్ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ ఇవే
ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. సంవత్సరం కాలంలో మళ్లీ ఎన్కౌంటర్ తెలంగాణగా మార్చేసిందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేంద్ర హోంమంత్రిని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరడం.. ఆపరేషన్ కగార్‌ను తెలంగాణలో అమలుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. అడవిలో పోలీసు శోధన పేరుతో నిత్యం నిర్బంధాలను అమలుపరుస్తూ.. ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపడానికి పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపింది. ఈ క్రమంలో ఏటూరునాగారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్య నేరం నమోదు చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
KCR : తెలంగాణ పునర్నిర్మాణ పోరాటం మళ్ళీ చేయాల్సిందే
-
Chicken Samosa: సమోసా ప్రియులకు పండగే.. బండి మీద రుచితో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
-
GT vs MI: సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
-
KCR : పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా..? కేసీఆర్ సావాలి అంటున్నారు.. నేను సావను..
-
2026 Kia Syros: కొత్త వేరియంట్లు & ఆటో ఆప్షన్లతో 2026 కియా సైరోస్ లాంచ్.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?