NTV Telugu Site icon

Suryapet: బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడు.. వెళ్లొద్దంటూ ఏడ్చిన విద్యార్థులు

Suryapet

Suryapet

తల్లిదండ్రుల తర్వాత ప్రత్యక్ష దైవం గురువు అని చెబుతారు. ఎందుకంటే తల్లిదండ్రులు కేవలం జన్మనిస్తే గురువులు మాత్రం ఆ జీవితానికి పరమార్థం చూపి సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు. గురువులు సభ్య సమాజంలో ఎలా నడుచుకోవాలి అన్న విషయాన్ని నేర్పుతూ ఉంటారు. అందుకే విద్యార్థులకు గురువులకు మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఉంటుంది. అయితే ఎక్కడ చదువుకున్నా.. ఎక్కడికి వెళ్ళినా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా.. మనకు చదువు చెప్పిన గురువులు కనిపించారూ అంటే ఒక గౌరవప్రదమైన నమస్కారం చేస్తాం. అంతలా గురువులు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ ఉంటారు.

Read Also: NTA: ఏం చేద్దాం చెప్పండి.. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో పేరెంట్స్‌ని కోరిన కేంద్రం..

అయితే ఇక కొంత మంది ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు మరింత అమితమైన ప్రేమ అభిమానం కలిగి ఉంటారు. ఇలాంటి పంతులు తమకు దొరకడం ఎంతో అదృష్టం అంటూ భావిస్తూ ఉంటారు. కానీ అలాంటి ఉపాధ్యాయుల చివరికి బదిలీ అయ్యి వెళ్లిపోతున్నారూ అని తెలిస్తే ఆ విద్యార్థులు గుండె బద్దలయినంత పని అవుతూ ఉంటుంది. తాజాగా.. సూర్యాపేట జిల్లాలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చూసి పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. తమను వదిలి వెళ్లిపోవద్దంటూ టీచర్ను పట్టుకుని విద్యార్థులు ఏడ్చేశారు. ఈ ఘటన మద్దిరాల (మం) పోలుమల్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మెంతబోయిన సైదులును పట్టుకొని విద్యార్థులు ఏడ్చేశారు.

Read Also: Minister Sandhya Rani: మన్యం జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చూసి పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. వివరాల్లోకెళ్తే.. పోలుమల్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మెంతబోయిన సైదులు బదిలీపై వెళ్తుండడంతో.. తమను వదిలి వెళ్లిపోవద్దంటూ టీచర్ ను పట్టుకొని విద్యార్థులు ఏడ్చారు. అంతేకాకుండా.. ఉపాధ్యాయుడి కాళ్ళ మీద పడి మరి వెళ్ళిపోవద్దంటూ ప్రాధేయపడ్డారు.