NEET-UG: నీట్-యూజీ పరీక్ష రద్దుపై రేపు సుప్రీం కోర్టులో విచారణ..
- పిటిషన్లను విచారించనున్న సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం
- పరీక్ష రద్దుపై గతంలో కేంద్రాన్ని వివరణ కోరిన కోర్టు
- పరీక్ష రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన కేంద్రం
- పలు కారణాలను ప్రస్తావిస్తూ.. కోర్టులో అవిడవిట్ దాఖలు చేసిన సెంట్రల్ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్-యూజీ పరీక్ష రద్దుపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించి.. తీర్పువెలువరించనుంది. నీట్-యూజీ పరీక్ష రద్దు చేయాలని.. పరీక్షలో అవకతవకలు జరిగాయని కొందరు విద్యార్థులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికే ఆ పిటిషన్లపై విచారణ కొనసాగించిన కోర్టు.. పరీక్ష రద్దుపై కేంద్రాన్ని వివరణ కోరింది. స్పందించిన కేంద్రం పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పలు కారణాలు పేర్కొంది. మొత్తం పరీక్షను రద్దు చేయడం వల్ల ఈ ఏడాది మే 5న జరిగిన పరీక్షలో పాల్గొన్న లక్షలాది మంది నిజాయితీ గల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని కేంద్ర తెలిపింది.
READ MORE: Jammu Kashmir: ఉగ్రదాడుల వెనక లష్కర్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. తలపై రూ. 10 లక్షల నజరానా..
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన అఫిడవిట్లో.. “ఆలిండియా పరీక్షలో ఎటువంటి పెద్ద అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేనప్పుడు, మొత్తం పరీక్ష..ఇప్పటికే ప్రకటించిన ఫలితాలను రద్దు చేయడం సరికాదు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు నష్టం జరుగుతుంది. అవకతవకలు, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే పలువరి నిందితులను సీబీఐ అరెస్ట్ చేసింది. విచారణ కొనసాగుతోంది. ఇకపై అన్ని పోటీ పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నాం.” అని కేంద్రం తెలిపింది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!