Spirit FirstLook : స్పిరిట్ ఫస్ట్ లుక్ అరాచకమే.. కానీ అదే మైనస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూ ఇయర్ గిఫ్ట్‌గా తన సెంటిమెంట్‌లో భాగంగా ఇండియన్ సినిమా ఆజానుబాహుడు.. అంటూ స్పిరిట్ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ఇక ఈ లుక్ చూసిన తర్వాత అరాచకం అనేలా ఉంది. ఇప్పటి వరకు ప్రభాస్‌ను చూడని విధంగా చూపించాడు వంగా. నోటిలో సిగరెట్, చేతిలో మందు బాటిల్‌తో కనిపించాడు ప్రభాస్. ఆ సిగరెట్‌ను హీరోయిన్ త్రిప్తి డిమ్రి వెలిగిస్తుండడం ఫ్యాన్స్‌కు ఎక్కడా లేని హై ఇచ్చింది. అలాగే.. బ్యాక్ లుక్‌లో ఉన్న డార్లింగ్ బాడీ మీద ఉన్న భారీ గాయలు చూస్తే.. ఈ సినిమా ఎంత వైలెంట్‌గా ఉండబోతుందనే దానికి పోస్టర్ ఒక శాంపిల్‌లా ఉంది.
Also Read : Dhurandhar2 : ధురంధర్ 2 దెబ్బకు దుకాణం సర్థుకుంటున్న బాలీవుడ్ సినిమాలు
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ఒక్క మాటలో చెప్పాలంటే.. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ రూత్‌లెస్ కాప్‌గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. ఎక్కడ చూసిన లుక్ గురించే చర్చ జరుగుతోంది. లుక్ ఎలా ఉందంటూ పోల్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభాస్ లుక్ అదిరిపోగా, అదొక్కటే మైనస్ అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా స్టైల్‌లో వైల్డ్‌గా ఉన్న స్పిరిట్ లుక్.. ఆయన గత సినిమాల హీరోల ఫస్ట్ లుక్‌ని పోలి ఉందని అంటున్నారు. వెనక నుంచి సడెన్‌గా చూస్తే అనిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌లా ఉన్నాడని అంటున్నారు. ముందు నుంచి చూస్తే అర్జున్ రెడ్డి లుక్‌లా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి, రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పిలకతో చాలా స్టైలిష్‌గా అదిరిపోయే లుక్‌లో కనిపించాడు ప్రభాస్. దీంతో.. అదే లుక్‌ని వంగా రిలీజ్ చేస్తాడని అంతా భావించారు. కానీ, సందీప్ మాత్రం ప్రభాస్‌ను లాంగ్ హెయిర్‌తో వైల్డ్‌గా చూపించాడు. అందుకే.. అనిమల్, అర్జున్ రెడ్డి లుక్‌తో పోలుస్తున్నారు. కానీ, అక్కడుంది పాన్ ఇండియా కటౌట్, అలాంటి కటౌట్‌తో సందీప్ చేయబోయే విధ్వంసం ఊహకు కూడా అందుకుండా ఉంటుందని రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తంగా.. స్పిరిట్ ఫస్ట్ లుక్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా!
తాజావార్తలు
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!