Site icon NTV Telugu

Young Voters: భారతదేశంలో పెరిగిన యువ ఓటర్లు.. ఏఏ రాష్ట్రంలో ఎంతంటే..?

Young Voters

Young Voters

IndiaVoter List: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా తయారీ తుదిదశకు చేరుకుంది. ఫిబ్రవరి మొదటి వారం నాటికి అందిన లెక్కల ప్రకారం.. మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. అందులో 21.5 కోట్ల మంది వ్యక్తులు కేవలం 29 ఏళ్లలోపు వారు మాత్రమే ఉన్నారు. యంగ్ ఓటర్లే భారతదేశంలో రాబోయే ఎన్నికలకు పునాదిగా నిలవనున్నారు.

Read Also: Penalty On Banks: ఆర్బీఐ మరో కఠిన చర్య.. ఎస్బీఐ సహా మూడు బ్యాంకులకు భారీ జరిమానా

వృద్ధ ఓటర్లు..
మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో సీనియర్ సిటిజన్ ఓటర్లు ఉన్నారు.. అందులో 80 ఏళ్లు పైబడిన వారు దాదాపు 26 లక్షల మందికి పైగా ఉండగా.. 56,800 మంది 100 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. ఇక, 80 ఏళ్లలోపు 24.2 లక్షలు మంది ఉండగా అందులో ఉత్తరప్రదేశ్ లో 32,800 మందికి పైగా వందేళ్ల లోపు వృద్ధులు ఉన్నారు.. ఇక, బీహార్, రాజస్థాన్ రెండింటిలోనూ 20,000 మంది శతాధిక వృద్ధ ఓటర్లు ఉన్నారు. అలాగే, వికలాంగ ఓటర్ల విషయంలో ఉత్తరప్రదేశ్ అత్యధిక సంఖ్యలో 12.2 లక్షల మంది వ్యక్తులతో తొలి స్థానంలో నిలిచింది.

Read Also: Reddy Appalanaidu: ఏలూరు జనసేన ఇంచార్జ్‌ అసంతృప్తి.. పార్టీపై సంచలన వ్యాఖ్యలు

దక్షిణ & ఈశాన్య ప్రాంతంలో మహిళా శక్తి..
జెండర్ డైనమిక్స్ పరంగా, దక్షిణ, ఈశాన్య భారతదేశంలోని అనేక రాష్ట్రాలు చెప్పుకోదగ్గ ధోరణిని కలిగి ఉన్నాయి. కేరళ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, గోవా, ఆంధ్రప్రదేశ్‌లలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య పెరిగినట్లు నివేదించింది. ఈ మార్పు ఎన్నికల ప్రక్రియలో మహిళల యొక్క భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో ఇదే ధోరణి ఉంది. భారత ఎన్నికలలో లింగ ప్రాతినిధ్యానికి సంబంధించిన అభివృద్ధి చెందుతుంది.

Read Also: Mukesh Ambani: అంబానీ ఇంట పెళ్లి సందడి..మూడు రోజులు జరిగే ఈవెంట్స్ ఇవే..

* ఏఏ రాష్ట్రంలో ఎంత శాతం ఓటర్లంటే..?
దాద్రా నగర్‌-హవేలీలో 38%
అరుణాచల్ ప్రదేశ్‌లో 33%
జమ్ముకశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్‌లలో 27% కంటే ఎక్కువ
కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో 20%
తెలంగాణలో 22%
ఉత్తరప్రదేశ్‌లో 21%

*ఇక, మొదటి సారి ఓటర్లు 18-19 సంవత్సరాలు..
దాద్రా నగర్ హవేలీలో 7%
అరుణాచల్ ప్రదేశ్‌లో 5%
మిజోరంలో 4%
J&K, లడఖ్‌లలో 3.9%

* అలాగే, 20-29 సంవత్సరాల వారు..
మేఘాలయ, దాద్రా & నగర్ హవేలీలలో 30% పైగా
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలో 27%-29%
యూపీలో దాదాపు 20%
పశ్చిమ బెంగాల్‌లో 21%
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో 24.5%

Exit mobile version