మన దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది.. విలాసవంతమైన జీవితం గడిపే అంబానీ ఫ్యామిలీ.. తమ వారికి అందించే కానుకల్లో ఏమాత్రం వెనకాడరని చాలా సందర్భాల్లో నిరూపించారు. ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహ సందడి మొదలైంది.. మరి కొద్ది పెళ్లి జరగనుంది.. మూడు రోజులు జరిగే ఈ పెళ్లికి వచ్చే గెస్టులు, కార్యక్రమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మార్చి 1 నుంచి 3 వరకు జరగనున్న ఈ వేడుకలకు ప్రపంచం నలుమూలల నుంచి గ్లోబల్ లీడర్స్, సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. రాబోయే అతిధుల కోసం అంబానీ కుటుంబం కావలసినన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. మార్చి 1 నుంచి అతిథులను తీసుకురావడానికి ముంబై, ఢిల్లీ నుంచి జామ్‌నగర్‌కు స్పెషల్ చార్టడ్ ఫ్లైట్స్ నడవనున్నట్లు సమాచారం. జామ్‌నగర్‌లో కావలసినన్ని స్టార్ హోటల్స్ లేకపోవడం వల్ల అల్ట్రా లగ్జరీ టెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు..
మార్చి 1: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల మొదటి రోజు ‘యాన్ ఈవినింగ్ ఇన్ ఎవర్‌ల్యాండ్’గా జరుపుకుంటారు. ఇందులో అతిధులు సొగసైన కాక్‌టెయిల్ డ్రెస్సులు ధరించనున్నట్లు సమాచారం.
మార్చి 2: ఎ వాక్ ఆన్ ది వైల్డ్‌సైడ్’ని నిర్వహించి, ‘జంగిల్ ఫీవర్’ నిర్వహించనున్నారు. దీనికోసం కూడా ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఈవెంట్ జామ్‌నగర్‌లోని అంబానీల జంతు సంరక్షణ కేంద్రం దగ్గర నిర్వహించనున్నారని సమాచారం..
మార్చి 3: టస్కర్ ట్రైల్స్, హష్టాక్షర్ అనే రెండు ఈవెంట్‌లు జరుగుతాయి. ఇందులో టస్కర్ ట్రైల్స్ అవుట్‌డోర్ ప్రాంతంలో నిర్వహించనున్నారు. హష్టాక్షర్ ఈవెంట్‌లో అతిధులు ‘హెరిటేజ్ ఇండియన్ దుస్తులు’ ధరించనున్నట్లు సమాచారం..
ఇకపోతే ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కార్యక్రమాలకు హాజరయ్యే అతిధుల జాబితాలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈవో టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, డిస్నీ సీఈవో బాబ్ ఇగర్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, అడ్నాక్ సీఈవో సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్, ఈఎల్ రోత్‌స్‌చైల్డ్ చైర్ లిన్ ఫారెస్టర్ డి రోత్‌స్‌చైల్డ్ మొదలగువారు హాజరుకానున్నారు..