The Raja Saab Trailer: పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ నటించిన కొత్త సినిమా ‘ది రాజాసాబ్’. తాజా ఈ చిత్రం సరికొత్త ట్రైలర్ 2.0 ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో కనిపించిన భారీ విజువల్స్, వినిపించిన తమన్ సంగీతం, మాయ చేసిన మారుతి దర్శకత్వంతో ‘ది రాజాసాబ్’ ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణాన్ని సృష్టిస్తుందని డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
READ ALSO: Virat Kohli: అభిమానులకు శుభవార్త.. మరో మ్యాచ్ ఆడనున్న విరాట్ కోహ్లీ!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ 2.0లో ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ, భారీ సెట్స్, అదిరిపోయే వీఎఫ్‌ఎక్స్‌లు చూసే వారిని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. “నువ్వు ఒంటరివి కావు” అనే ట్యాగ్‌లైన్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లో ప్రభాస్ లుక్ అభిమానుల మనసు దోచుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ వంటి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు మలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ వంటి అందాల భామలు ఈ ట్రైలర్‌లో మెరిశారు. థమన్ సంగీతం ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది. 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ 2.0 వాటిని మరింత పెంచింది.
READ ALSO: Nepal: నేపాల్ రాజకీయాల్లో సరికొత్త మలుపు..
