Caste Census: ఏపీలో రేపటి నుంచి కుల గణన.. 5 ప్రాంతాల్లో ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రేపటి నుంచి కుల గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణన స్టార్ట్ చేయనున్నారు. 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో మొదలు కానుంది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కుల గణన జరుగనుంది. రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా కులగణన చేపట్టనున్నారు. కుల గణనపై ఈ నెల 22 వరకు శిక్షణ.. రేపటి నుంచి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగనున్నాయి. ఐదు పట్టణాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు. ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలుతో పాటు 20వ తారీఖున విజయవాడ, విశాఖపట్నంలో ఇక, 24న తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు.
Read Also: Ghost : శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Paper Leaks: పంజాబ్‌లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
అలాగే, ఏపీలో సమగ్ర కులగణన కోసం గత 8 నెలలుగా జగన్ సర్కార్ అధ్యయనం చేస్తుంది. దీని కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రణాళిక, సచివాలయాల శాఖల ముఖ్యకార్యదర్శలతో జగన్ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఆరుగురు అధికారుల కమిటీ దేశంలో కులగణన చేపట్టిన రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో పర్యటించారు. అక్కడ న్యాయపరంగా వస్తున్న ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకుంది. అయితే, కులగణన ఎలా చేపట్టాలి.. ఎలాంటి సమాచారం తీసుకోవాలనే అంశాలతో ఈ కమిటీ ప్రభుత్వానికి ఓ రిపోర్ట్ ఇచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఉన్న సుమారు కోటీ 60 లక్షల కుటుంబాలను ప్రభుత్వం సర్వే చేయనుంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి డేటా సేకరించనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్ ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సమాచారం మొత్తం యాప్‌లోనే డిజిటల్ విధానంలో అప్ లోడ్ చేయనున్నారు.
తాజావార్తలు
-
Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్‌లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?