Water Melon : వేసవి వచ్చిందటే ప్రతి ఒక్కరూ పుచ్చకాయను తినేందుకు ఇష్టపడుతారు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో వాటర్ కంటెంట్ పెరిగి.. కొంత ఉపశమనం పొందుతారు. అంతే కాకుండా డీహైడ్రేషన్ సమస్యలు ఉంటే వాటికి చక్కటి మందుగా పనిచేస్తుంది. అందుకే సమ్మర్లో వాటర్ మెలన్(పుచ్చకాయ) కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ కేజీ రూ.15నుంచి రూ.50దాటదు. కానీ ఇప్పుడు చెప్పబోయే పుచ్చకాయ ధరగురించి వింటే మీరు అవాక్కవుతారు. ఆ పుచ్చకాయ ఖరీదు ఎంతో తెలుసా అక్షరాల రూ.5 లక్షలు… వామ్మో పుచ్చకాయ ధర అంత ఉండటం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా.. అది మనదగ్గర కాదులేండి.
Read Also: Hari Hara Veeramallu : పవన్ నోట.. మళ్లీ పాట
జపాన్ దేశంలో అత్యంత ఖరీదైన పండ్లను పండిస్తారు. ఈ క్రమంలోనే రకరకాల పుచ్చకాయలు అక్కడ లభిస్తాయి. వాటిలో ఒకటి డెన్సుకే పుచ్చకాయ. దీన్ని పండించేందుకు అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు పాటిస్తున్నారు. అయితే ఇందులో స్పెషల్ ఏమిటంటే.. ఇది ఆరు నుంచి ఏడు కిలలో బరువు ఉంటుంది. లోపల ఎర్రగా జ్యూసిగా ఉంటుంది. అంతేకాకుండా దీని రుచి కూడా చాలా బాగుంటుందంట. తియ్యగా కరకరలాడుతూ, రవ్వ రవ్వగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో గింజలు కూడా చాలా చిన్నగా ఉంటాయంట. అందువలన ఈజీగా తినవచ్చు.
Read Also: The Test : మొదటిసారి.. మాధవన్, నయనతార ‘ది టెస్ట్’
అయితే, ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ పుచ్చకాయలను తినరంట. ఎవరికైనా ఇష్టమైన వాళ్లకు గిఫ్ట్ ఇచ్చేందుకు వాటిని కొంటారట. ఎందుకంటే ఈ పుచ్చకాయలు ఎన్ని కావాలంటే అన్ని లభించవు. పండిన వాటికి విపరీతమైన డిమాండ్ ఉంటుందంట. హొక్కాయిడోలో భూమి సారవంతమైనది. అక్కడి ప్రత్యేక వాతావరణంలో మాత్రమే పండుతాయి.