Site icon NTV Telugu

TFCC : రసవత్తరంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్

Tfcc

Tfcc

నేడు రసవత్తరంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు. ఈ ఉదయం 8 గంటల నుంచి మొదలయిన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ లో భాగం అయిన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం సభ్యులు 3,355 మంది ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. అధ్యక్ష కార్యదర్శిల తో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులకు ఓటు వేయనున్నారు సభ్యులు.

Also Read : TFCC Elections : ఛాంబర్ ఎలక్షన్స్ మన ప్యానెల్ vs ప్రొగ్రెసివ్ ప్యానల్ మధ్య తీవ్ర పోటీ

ఈ సారి ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు సభ్యులు. ప్రధానంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ మధ్యే పోటీ నెలకొంది. చిన్న నిర్మాతలు అంతా మన ప్యానల్ గా పోటీచేస్తుండగా అగ్ర నిర్మాతలు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంతా ప్రోగ్రెసివ్ ప్యానల్ గా పోటీ చేస్తున్నారు. చిన్న సినిమా నిర్మాతల మన ప్యానల్ ను సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్ బలపరుస్తున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానల్ ను అల్లు అరవింద్, దిల్ రాజు , సురేష్ బాబు  బలపరుస్తున్నారు. గిల్డ్ పేరుతో కోట్లాది రూపాయల చిత్ర పరిశ్రమ సొమ్మును దోచుకుంటున్నారని చిన్న నిర్మాతల మన ప్యానెల్ సభ్యుల ఆరోపణ చేస్తున్నారు. పదవుల కోసం కాదు అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ ఎన్నికలు అని బడా నిర్మాతల ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు వాదిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఛాంబర్ ఎన్నికలు జగగనుండగా ప్రస్తుత ఛాంబర్ కార్యవర్గ పదవి కాలం జూలై లోనే ముగిసినా కూడా పలు కారణాల వల్ల ఎన్నికలు వాయిదా వేశారు. నేడు జరిగే ఎన్నికల్లో విజయం సాధించే నూతన కార్యవర్గం జూలై 2027 వరకు భాద్యతలు నిర్వహించనుంది. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ టాలీవుడ్ లో నెలకొంది.

Exit mobile version