నేడు రసవత్తరంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు. ఈ ఉదయం 8 గంటల నుంచి మొదలయిన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ లో భాగం అయిన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం సభ్యులు 3,355 మంది ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. అధ్యక్ష కార్యదర్శిల తో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులకు ఓటు…