Site icon NTV Telugu

Manmohan Singh Memorial: మన్మోహన్ సింగ్ స్మారకంపై రాజకీయ రగడ..

Manmohan Singh Memorial

Manmohan Singh Memorial

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక స్థలానికి సంబంధించి వివాదం ముదురుతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశ్నను లేవనెత్తుతూ.. “ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు.. అన్ని విభేదాలు కూడా అతనితో అంతం కావాలి. కానీ ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియల్లో కూడా ఇలాగే చేసి ఉంటే మీకు ఎలా అనిపించేది? మన్మోహన్ సింగ్ స్మారకం కోసం ఇంకా స్థలం కేటాయించకపోవడం సరికాదన్నారు. ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన ప్రశ్న కాదు. దేశ చరిత్రకు సంబంధించిన అంశం కదా?” అని వ్యాఖ్యానించారు.

READ MORE: Tamil Nadu: అన్నా యూనివర్సిటీ ఘటనపై మద్రాస్ హైకోర్టు సీరియస్.. సిట్ ఏర్పాటు

అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “ఈ విషయంపై మనం మాట్లాడటం చాలా సిగ్గుచేటు. డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియల కోసం రాజ్‌ఘాట్ కాంప్లెక్స్‌లో స్థలం ఇవ్వడానికి మీరు ఎందుకు సిద్ధంగా లేరని నేను ప్రధాని నరేంద్ర మోడీని అడగాలనుకుంటున్నాను. నిగంబోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు చేసిన ఇతర మాజీ ప్రధానులు లేరా? ఈ సమస్యను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి. ఈ డిమాండ్ కేవలం కాంగ్రెస్ ది మాత్రమే కాదు. మొత్తం దేశం, భారతీయ సమాజానికి చెందినది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించిన చోటే.. స్మారక చిహ్నం నిర్మించాలి.” అని డిమాండ్ చేశారు.

READ MORE: Harish Rao: మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదు..

కాగా, కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురుదాడి చేసింది. కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ఆరోపించారు.కాంగ్రెస్ ఎప్పుడూ గాంధీ కుటుంబానికి వెలుపల ఉన్న నాయకులను గౌరవించదని, కానీ మోడీ ప్రభుత్వం అన్ని పార్టీల నాయకులను గౌరవిస్తోందన్నారు.. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో ఫోన్‌లో మాట్లాడి స్మారక చిహ్నం కోసం తగిన స్థలాన్ని కేటాయించాలని కోరారు. అనంతరం హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఈ అంశంపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, అంత్యక్రియలకు సంబంధించిన ప్రక్రియకు ఎలాంటి ఆటంకం ఉండదని చెప్పారు.

 

Exit mobile version