PCB Files Burning Case: పీసీబీ ఫైల్స్ దగ్ధం వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది.. అయితే, ఈ రోజు పీసీబీ కార్యాలయంలో పోలీసుల తనిఖీలు నిర్వహించారు.. బెజవాడలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. పీసీబీలో ఏడు సెక్షన్లకు సంబంధించిన అధికారులను విచారించారు.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పోలీసుల విచారణ కొనసాగింది.. మొత్తంగా నాలుగు గంటలపాటు పోలీసుల విచారణ సాగింది.. దహనం చేసేందుకు ప్రయత్నించిన ఫైల్స్ లో ఉన్న అంశాలపై ఆయా సెక్షన్ల అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు పోలీసులు.. కార్యాలయ నుంచి ఫైల్స్ బయటకు వెళ్తున్న విషయం, దహనం చేయాలన్న ఆదేశాలపై మీకు సమాచారం ఉందా? లేదా? అని ప్రశ్నించారు పోలీసులు.. అవసరమైతే మళ్లీ విచారణకు వస్తామని అధికారులకు చెప్పారు..
Read Also: Saranga Dariya: భారతీయుడు 2 రిలీజ్ రోజే రాజా రవీంద్ర ‘సారంగదరియా’
కాగా, ఈ కేసు విచారణలో పోలీసులకి OSD రామారావు చుక్కలు చూపించినట్టుగా ప్రచారం సాగుతోంది.. ఆ డాక్యుమెంట్స్ పనికిరావని పోలీసులకి విచారణలో చెప్పారట రామారావు.. కానీ, ఆ ఫైల్స్ పడేయాలని చెప్పిన వారి గురించి మాత్రం రామారావు నోరు విప్పలేదట.. ప్రభుత్వ డాక్యుమెంట్స్ డిస్పోజ్ చేసేందుకు ఉన్న ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వలేదో కూడా రామారావు చెప్పలేదని తెలుస్తోంది.. పోలీసులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ లో కొన్ని పీసీబీ వెబ్ సైట్ లో ఓపెన్ డాక్యుమెంట్స్ గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.. ఇక, దహనం చేసేందుకు ప్రయత్నించిన ఫైల్స్ లో కీలకమైనవి ఏమన్నా ఉన్నాయా అనే గుర్తించే పనిలో పడిపోయారు పోలీసులు.. కాగా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డుల దగ్ధం కేసు కలకలం రేపింది.. ఈ కేసులో ఓఎస్డీ ఎస్వీ రామారావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. సగం కాలిన రికార్డులు, హార్డ్ కాపీలను కూడా గన్నవరం తీసుకెళ్లారు పోలీసులు. ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘ కాలం పనిచేసిన రామారావుపై.. గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్న విషయం విదితమే.