NTV Telugu Site icon

Hyderabad: భూ కబ్జాదారులపై బుల్డోజర్స్తో యాక్షన్.. సైబరాబాద్ పరిధిలో మొదటిసారి

Land Kabja

Land Kabja

భాగ్య నగరంలో భూ కబ్జాదారులు పెరిగిపోతున్నారు. ఎక్కడ ల్యాండ్ ఖాళీగా కనపడితే దాన్ని అక్కడ కబ్జాకు పాల్పడుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ల్యాండ్ కబ్జా చేసిన ఘటనలు ఎదురయ్యాయి. నిన్న (ఆదివారం).. అత్తాపూర్లోని అక్బర్ హిల్స్లో ల్యాండ్ కబ్జాకు పాల్పడిన 9 మంది రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలలో భూ కబ్జాలకు పాల్పడుతూ.. యజమానులను బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో.. పోలీసులు ల్యాండ్ కబ్జాను అరికట్టేందుకు బుల్‌డోజర్స్ కు పని చెప్పారు. భూ కబ్జాదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

Read Also: Raj Tarun- Lavanya: రాజ్ తరుణ్ నా ఫ్రెండ్.. ఆవేశంతో ఊగిపోయిన RJ శేఖర్ భాషా

సైబరాబాద్ పరిధిలో ల్యాండ్ కబ్జాలకు పాల్పడుతున్న భూ కబ్జాదారులపై బుల్డోజర్స్తో పోలీసులు యాక్షన్లోకి దిగారు. మొదటిసారి అక్రమార్కులపై బుల్డోజర్స్ అస్త్రాన్ని ప్రయోగించారు. గండిపేటలో ఓ డాక్టర్ స్థలంను కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడ్డారు కబ్జాదారులు. ఈ స్థల వివాదంలో ఎమ్మార్పీఎస్ నేత నరేందర్ తో పాటు మరొకరిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన ఎమ్మార్పీఎస్ నేతను శంషాబాద్ లోని ఫామ్ హౌస్ లో పెట్టి హింసించారు. అంతేకాకుండా.. 20 కుక్కలు, పొట్టేళ్ల మధ్యలో నరేందర్ను చిత్రహింసలకు గురిచేశారు భూకబ్జాదారులు. ఈ క్రమంలో.. అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిన ఫామ్ హౌస్ ని సైబరాబాద్ పోలీసులు కూల్చివేస్తున్నారు. రాజేంద్రనగర్ డీసీపి నేతృత్వంలో ఫామ్ హౌస్ కూల్చివేశారు. బుల్‌డోజర్స్ తో ఫాంహౌస్ మొత్తాన్ని నేల మట్టం చేశారు అధికారులు.

Read Also: Loan App harassment: లోన్‌యాప్‌ వేధింపులు.. సచివాలయం ఉద్యోగి అదృశ్యం..

Show comments