The Paradise: సెకండ్ సింగిల్.. “యేష నాగుల” లైవ్‌గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొట్టిన నాని.!
- ది ప్యారడైజ్’ నుంచి రెండో సింగిల్ ‘యెష నాగుల కట్ట మీద’..
- అమెరికాలోని డల్లాస్‌లో అనిరుధ్ రవిచందర్ లైవ్ కాన్సర్ట్‌లో..
- లైవ్‌గా పాడిన అనిరుధ్..
- మాస్ స్టెప్స్‌తో అదరగొట్టిన నాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise Second Single Yeshanagula: నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘దసరా’ వంటి మాస్ యాక్షన్ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి మళ్లీ జతకట్టి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా రెండో సింగిల్ ‘యెష నాగుల కట్ట మీద’ పాటతో మేకర్స్ మరోసారి సందడి చేశారు.
డల్లాస్‌లో అనిరుధ్ స్పెషల్ సర్ప్రైజ్:
‘ది ప్యారడైజ్’ రెండో సింగిల్ విడుదల విషయంలో మేకర్స్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా సినిమా పాటలను ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించి విడుదల చేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తన లైవ్ కాన్సర్ట్‌లోనే పాటను ప్రేక్షకులకు పరిచయం చేశారు. శుక్రవారం (ఆగస్టు 28)న అమెరికాలోని డల్లాస్‌లో అనిరుధ్ నిర్వహించిన లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో ‘యెష నాగుల’ (Yeshanagula) పాటను అభిమానుల సమక్షంలో లైవ్‌గా విడుదల చేశారు. దీంతో అక్కడికి వచ్చిన ప్రేక్షకులకు ఊహించని సర్ప్రైజ్ లభించింది. సినిమా పాటను ఇలా నేరుగా లైవ్ కాన్సర్ట్‌లో విడుదల చేయడం ప్రత్యేకంగా నిలిచింది.
Also Read
- Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్‌కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్‌కు తెలియని సీక్రెట్ ఇదే..!
తెలంగాణ జానపదానికి మాస్ టచ్:
‘యెష నాగుల కట్ట మీద’ అనేది తెలంగాణ నేటివిటీని ప్రతిబింబించే పాపులర్ జానపద గీతం. ఈ పాటను ‘ది ప్యారడైజ్’ కోసం మరింత మాస్ వైబ్‌తో రీమిక్స్ చేశారు. అనిరుధ్ రవిచందర్ అందించిన రాకింగ్ మాస్ బీట్స్ పాటకు హైలెట్. ‘దసరా’లో నానిని మాస్ యాక్షన్ హీరోగా చూపించిన శ్రీకాంత్ ఓదెల.. ‘ది ప్యారడైజ్’లోనూ ఆయనపై మాస్ ట్రీట్మెంట్ను మరింత పెంచినట్లు పాట ద్వారా అర్థమవుతుంది. ఈ క్యాచీ మాస్ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. జంగి రెడ్డి, సింగర్ ప్రభ తమ గాత్రంతో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. ఇప్పటికే డల్లాస్ కాన్సర్ట్‌లో పాటను విన్న అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు సమాచారం.
Dishti anthaaa povaleeeeee 🔥🔥🔥
Naatu masssss #Yeshanagula madness takes over all overrrr pic.twitter.com/HuIVNNF1yR
— THE PARADISE (@TheParadiseOffl) August 29, 2026
ప్రత్యేక ఈవెంట్ లేకుండానే రిలీజ్..
రెండో సింగిల్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఈవెంట్ నిర్వహించకుండా.. అనిరుధ్ తన లైవ్ కాన్సర్ట్‌లో పాటను విడుదల చేయడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొందరు అభిమానులు నిర్మాతలకు అదనపు ఈవెంట్ ఖర్చులు తగ్గించేలా అనిరుధ్ మంచి ఆలోచన చేశారని ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం తన లైవ్ కాన్సర్ట్‌కు మరింత పాపులారిటీ తీసుకురావడంలో భాగంగానే ఇలా చేసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే కారణం ఏదైనా.. పాటను లైవ్ కాన్సర్ట్‌లో వేలాది మంది అభిమానుల మధ్య విడుదల చేయడం మాత్రం ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో ప్రత్యేకంగా నిలవనుంది.
Earpods lo High volume lone ramp undhi Dolby lo oka range lo kummudhi #Yeshanagula #Theparadise pic.twitter.com/VClXhIkvFX
— Steve (@Pk45cult) August 29, 2026
డల్లాస్‌లో ఆగస్టు 28న లైవ్‌గా పరిచయం చేసిన ‘యెష నాగుల కట్ట మీద’ పాటను ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ వేదికలపై విడుదల చేశారు. దీంతో పాటను పూర్తిస్థాయిలో వినేందుకు అభిమానులకు అవకాశం లభించింది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగల్ “ఆయా షేర్” గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Yesha Nagula song is going to rock!
What an energy, beat and singing style🔥#TheParadise pic.twitter.com/sq5zl8aBkg
— idlebrain jeevi (@idlebrainjeevi) August 29, 2026
తాజావార్తలు
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్‌దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
-
Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్‌లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!