Site icon NTV Telugu

West Bengal: బెంగాల్లో కొనసాగుతున్న హత్యా రాజకీయం.. ఇప్పటివరకు 14 మంది మృతి..!

Bengal

Bengal

పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల్లో హింస కొనసాగుతోంది. రాష్ట్రంలోని పంచాయతీల్లోని 74 వేల స్థానాలకు శనివారం ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా.. పలుచోట్ల భారీ హింసాకాండ కూడా మొదలైంది. బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో రాళ్లు రువ్వడం, దహనం చేయడంతో పాటు దోపిడీ ఘటనలు జరుగుతున్నాయి. గత రాత్రి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోని పలు చోట్ల హింసాత్మక ఘటనల్లో 14 మంది మృతి చెందినట్లు సమాచారం.

Karnataka: కర్ణాటకలో జైన మత గురువు హత్య.. ఇద్దరు అరెస్ట్

ముర్షిదాబాద్‌లోని బెల్దంగాలో కాంగ్రెస్, తృణమూల్ మధ్య జరిగిన ఘర్షణలో అధికార పార్టీకి చెందిన బాబర్ అలీ అనే కార్యకర్త చనిపోయాడు. హింసాకాండ అనంతరం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు కూచ్‌బెహార్‌లోని ఓ పోలింగ్ స్టేషన్‌ను ధ్వంసం చేసి.. పోలింగ్ ప్రారంభమైన వెంటనే బ్యాలెట్ పత్రాలను లూటీ చేసి తగులబెట్టారు. మరోవైపు బెంగాల్‌లో హింసాత్మక ఘటనల మధ్య ఓటింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సులు తీసుకొని ప్రజలు పరుగులు తీస్తుండగా.. మరి కొన్నిచోట్ల నిప్పంటిస్తున్నారు. హుగ్లీలోని ఆరంబాగ్‌లో గ్రామస్థులు బ్యాలెట్ బాక్స్‌ను నీటిలో విసిరారు.

Falaknuma Express: తలుచుకుంటేనే గుండె దడ.. ట్రైన్ ఎక్కాలంటేనే భయం

బెంగాల్ హింసాత్మక ఘటనలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం అణచివేయబడిందని తెలిపారు. మమతా బెనర్జీతో పొత్తు పెట్టుకోవాల్సిన రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారు. ఈ ఘటనపై మల్లికార్జున్ ఖర్గే కూడా మౌనం వహిస్తుండడంతో ప్రతిపక్షాల నుంచి స్పందన లేదన్నారు. ప్రతి ఎన్నికల్లో బెంగాల్‌లో హింస ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు.

Exit mobile version