Tammy Hurricane: భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
Tammy Hurricane: శుక్రవారం అర్ధరాత్రి ఫ్రెంచ్ కరేబియన్ ద్వీపం గ్వాడెలోప్‌లో తుఫాను కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. హరికేన్ శనివారం పగటిపూట గ్వాడెలోప్ ద్వీపసమూహం సమీపంలో లేదా దాని మీదుగా వెళుతుందని అలానే దీని మార్గం రాత్రి సమయంలో సమీపంలోని సెయింట్-మార్టిన్ మరియు సెయింట్-బార్తెలెమీ దీవుల నుండి దూరం వెళ్లే అవకాశం ఉందని ఫ్రెంచ్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని కారణంగా భారీ వర్షపాతంతో పాటుగా బలమైన గాలులు వీస్తాయని సూచించింది. గంటకు 120 కిలోమీటర్లు నుండి 148 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఫ్రెంచ్ వాతావరణ సూచన మేటియో-ఫ్రాన్స్ అంచనా వేసింది. కాగా ఈ తుఫానుకు టామీ హరికేన్ అనే పేరు పెట్టారు. ఈ తుఫాను తీవ్రత తార స్థాయిలో ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది ఫ్రెంచ్ వాతావరణ శాఖా మేటియో-ఫ్రాన్స్. ఈ నేపథ్యంలో అధికారులు మాట్లాడుతూ రాబోయే తుఫాను తీవ్రత తార స్థాయిలో ఉంటుందని.. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
Read also:Israel-Hamas War: ఆ ఇద్దరిని వదిలిపెట్టిన హమాస్
Also Read
- Tamil Nadu Elections 2026: ఓటు హక్కు వినియోగించుకున్న సూర్య-జ్యోతిక జంట!
- West Bengal Elections: రణరంగంగా బెంగాల్.. తొలి దశలోనే రక్తపాతం.. బాంబు దాడులు, దహనకాండ!
- Hyderabad: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్.. రూ. 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
- PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
అయితే కరేబియన్ ద్వీపం పర్యాటక కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలో పర్యాటక కేంద్రమైన ద్వీపసమూహం లోని జనాభా తుఫాను తాకిడి లేని ప్రదేశాలలో ఆశ్రయం పొందాలని అలానే అధికారులు ఇచ్చే అన్ని సలహాలను గౌరవించి పాటించాలని అధికారులు ప్రజలను కోరారు. ఈ నేపథ్యంలో గ్వాడెలోప్‌లో వారాంతంలో జరగనున్న అన్ని ఈవెంట్‌లు రద్దు చేయబడ్డాయి. అలానే విమాన రాకపోకలు నిలిపివేశారు. ద్వీపాల మధ్య సముద్ర రవాణా కూడా నిలిచిపోయింది. శుక్రవారం ముందస్తు జాగ్రత్తగా ద్వీపం లోని నివాసితులు కావాల్సిన నీరు, ఆహారాన్ని సమకూర్చున్నారు. తుఫాను నుండి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీనుకుంటున్నారు. కాగా ద్వీపసమూహం 1,700 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇక్కడ 400,000 జనాభా నివసిస్తున్నారు. దాదాపు 7,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపసమూహాన్ని ఫ్రాన్స్ పరిపాలిస్తుంది.
తాజావార్తలు
-
Tamil Nadu Elections 2026: ఓటు హక్కు వినియోగించుకున్న సూర్య-జ్యోతిక జంట!
-
West Bengal Elections: రణరంగంగా బెంగాల్.. తొలి దశలోనే రక్తపాతం.. బాంబు దాడులు, దహనకాండ!
-
Hyderabad: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్.. రూ. 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
-
PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
-
SRH Players Dance: గ్రౌండ్‌లో బ్యాట్‌తోనే కాదు.. ఫ్లోర్‌పై డాన్స్‌తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?