Tammy Hurricane: శుక్రవారం అర్ధరాత్రి ఫ్రెంచ్ కరేబియన్ ద్వీపం గ్వాడెలోప్‌లో తుఫాను కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. హరికేన్ శనివారం పగటిపూట గ్వాడెలోప్ ద్వీపసమూహం సమీపంలో లేదా దాని మీదుగా వెళుతుందని అలానే దీని మార్గం రాత్రి సమయంలో సమీపంలోని సెయింట్-మార్టిన్ మరియు సెయింట్-బార్తెలెమీ దీవుల నుండి దూరం వెళ్లే అవకాశం ఉందని ఫ్రెంచ్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని కారణంగా భారీ వర్షపాతంతో పాటుగా బలమైన గాలులు వీస్తాయని సూచించింది. గంటకు 120 కిలోమీటర్లు…