బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమా లో రణ్ బీర్ ది మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.గ్యాంగ్‌స్టర్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్.. రణ్బీర్ కు ఫాదర్ గా కనిపించనున్నాడు.యానిమల్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ సినిమా తో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు.ఈ దర్శకుడు యానిమల్ సినిమాతో మరింత విధ్వంసం సృష్టించేందుకు సిద్ధం అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమా పై తిరుగులేని అంచనాలున్నాయి.
ఇప్పటికే రిలీజైన టీజర్ ఏ లెవల్లో విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా టీజర్ లో సందీప్ మార్క్ స్పష్టంగా కనిపించింది. డిసెంబర్ 1 న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక మేకర్స్ ఇప్పటి నుంచి వరుస అప్‌డేట్ లు ప్రకటిస్తూ సినిమా పై భారీగా అంచనాలు క్రియేట్ చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అమ్మాయి అంటూ సాగే మెలోడియస్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను తెగ ఆకట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా ఈ పాటలో ఒక సీన్‌ను రిప్రజెంట్ చేశారు. రణ్‌బీర్ కపూర్ తో పెళ్లి వద్దు అంటూ రష్మిక ఫ్యామిలీ మెంబర్స్ వాదిస్తుండగా.. రష్మిక మాత్రం తనే కావాలంటూ ముద్దుతో క్లారిటీ ఇవ్వడం.. ఆ తర్వాత వీళ్లు పెళ్లిచేసుకోవడం ఇలా పాటలో కొన్ని సీన్స్ ను చూపించారు. నిర్మాతలు ఈ పాట కోసం బాగానే ఖర్చుపెట్టారు.ప్రైవేట్ జెట్‌లో రణ్‌బీర్, రష్మిక లిప్‌లాక్ చేసుకుంటున్న పోస్టర్‌ను రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ పాట ను రాఘవ్ చైతన్య, ప్రీతమ్ ఆలపించారు..