Site icon NTV Telugu

TDP-BJP-Janasena: టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై ఏమన్నారంటే..!

Babu Pawan Sha

Babu Pawan Sha

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఉమ్మడి ప్రకటన వెలువడింది. ఈ క్రమంలో చంద్రబాబు, అమిత్ షా, పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. మళ్లీ ఎన్డీయేలో చేరడం సంతోషంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి సేవ చేయడం కోసమే టీడీపీ – బీజేపీ- జనసేన మధ్య పొత్తు కుదిరిందని తెలిపారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. మోడీ, అమీత్ షా, నడ్డా, పవన్ కళ్యాణ్ కలిసి ఏపీలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికే సమయం కోసం ఎదురుచూస్తున్నా.. రాష్ట్రాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం కూటమి స్వర్ణయుగం తెస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, తెలుగు ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ఏపీ ప్రజలు తమకు సేవ చేసేందుకు చారిత్రాత్మకమైన ఈ కూటమిని ఆశీర్వదించాలని చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.

Arun Goel: లోక్‌సభ ఎన్నికల ముందు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా..

మరోవైపు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. బీజేపీ – టీడీపీ – జనసేన కూటమి ఏపీ ప్రజల ఆకాంక్షలను వేగంగా నెరవేర్చుతుందని తెలిపారు. మోడీ నాయకత్వంపై తమకున్న నమ్మకాన్ని చాటుతూ టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీయేలో చేరాయన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాలను ఎన్డీఏలోకి స్వాగతిస్తున్నా.. నరేంద్ర మోడీ దార్శనికత నాయకత్వంలో ఎన్డీఏ బలమైన రాజకీయ వేదికగా ఏర్పడుతోందని ట్వీట్ లో తెలిపారు.

Asif Ali Zardari: ‘‘మిస్టర్ టెన్ పర్సెంట్’’ మళ్లీ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయ్యాడు.. వివాదాలు, అవినీతికి కేరాఫ్ జర్దారీ..

బీజేపీ-టీడీపీ-జనసేనలది చారిత్రాత్మక కూటమి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో తెలిపారు. ఏపీ ప్రజలకు ఆశ, స్థిరత్వం శ్రేయస్సు అందించడమే కూటమి లక్ష్యం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బాధ్యతాయుతమైన భాగస్వాములుగా పని చేస్తాం.. ఏపీని అన్ని విధాలుగా శక్తివంతమైన రాష్ట్రంగా మార్చడానికి మా వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎన్డీఏ సహజ భాగస్వామి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ, రాష్ట్ర శ్రేయస్సు కోసం మా ఎన్డీఏ కూటమిని మరింత స్థిరీకరించడానికి ఎదురు చూస్తున్నట్లు పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో తెలిపారు.

Exit mobile version