శుక్రవారం ఉదయం పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండటంతో లక్నో విమానాశ్రయంలో ఐదు విమానాలు ల్యాండ్ కాలేదు. హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, ఇండోర్ నుంచి వచ్చే విమానాలు గాలిలో చక్కర్లు కొట్టడంతో వాటిని దారి మళ్లించారు. ఇదిలా ఉండగా.. పట్నాలోని జయప్రకాశ్ నారాయణ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై ట్రాక్టర్ మోరాయించడంతో ఇండిగో విమానం దాదాపు 40 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టింది.