Site icon NTV Telugu

Boy Kidnap: డామిట్ కథ అడ్డం తిరిగింది.. కిడ్నాప్‎తో లైఫ్ సెట్ అయినట్టే అనుకున్నారు.. కానీ

Boy Kidnap

Boy Kidnap

Boy Kidnap: ఏం చేసినా కలిసి రావడంలేదు.. ఎలాగోలా ఒక రిచ్ కిడ్ ను కిడ్నాప్ చేస్తే లైఫ్ సెట్ అవుతుంది అనుకున్నారు. వేసిన ప్లాన్ ప్రకారం చిన్నారిని ఎంచుకుని కిడ్నాప్ చేశారు. కానీ పోలీసులు రివర్స్ ప్లాన్ వేసేసరికి ఏం చేయాలో తెలియక చిన్నారిని వదిలేసి వెళ్లిపోయారు. సినిమాటిక్ పద్ధతిలో జరిగిన ఈ సంఘటన నాసిక్ పట్టణంలో చోటు చేసుకుంది. నాసిక్‌లోని సిన్నార్ పట్టణంలో సాయంత్రం ఓ వ్యాపారి కొడుకు చిరాగ్ తుషార్ కలంత్రి కిడ్నాప్‌కు గురయ్యాడు. నెంబర్ ప్లేట్ లేని తెల్ల రంగు ఓమ్నీ కారులో ముగ్గురు వ్యక్తులు బాలుడిని అపహరించారు.

Read Also: Human Composting : మనుషుల మృతదేహాల నుంచి ఎరువులు.. వినడానికే కొత్తగా ఉంది కదూ

బాలుడి తండ్రికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. అతడి కిడ్నాప్ గురించి తెలియగానే కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. చిరాగ్ తుషార్ కలంత్రి కిడ్నాప్ గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నాసిక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షాహాజీ ఉమాప్ వెంటనే జిల్లా మొత్తాన్ని దిగ్బంధించారు. అపహరణకు గురైన వారు తప్పించుకోలేకపోవడంతో.. కొద్ది గంటల్లోనే చిన్నారిని ఇంటి దగ్గర వదిలిపెట్టి పారిపోయారు. ఈ కిడ్నాప్ ఎవరు చేశారు? కళంత్రి కుటుంబం నుండి ఎవరు డబ్బు వసూలు చేయాలనుకుంటున్నారు, ఎవరు ప్రమేయం ఉన్నారో నాసిక్‌ రూరల్ పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Read Also: Man killed Woman: తనకంటే ఏడేళ్లు చిన్నవాడితో డేటింగ్.. పెళ్లి అనగానే మర్డర్

Exit mobile version