NTV Telugu Site icon

Hyderabad: ప్రాణం తీసిన అనుమానం.. భార్యను హత్య చేసిన భర్త

Hyderabad

Hyderabad

అనుమానం పిచ్చితో భార్యను హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. భర్త నర్సింహులు గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో గ్యాస్ డెలివరి బాయ్ గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం చిట్కుల్ గ్రామనికి చెందిన ఇందిరతో నర్సింహులుకి వివాహం అయింది. అయితే.. 13 ఏళ్లుగా సాఫీగా సాగుతున్న జీవితంలో అనుమానం అనే ఓ దెయ్యం వచ్చి ఓ నిండు జీవితాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్‌లో భార్యను హత్య చేసి మృతదేహాన్ని స్వస్థలం ఆందోల్ కి తీసుకువచ్చాడు నిందితుడు. తన భార్య గుండెపోటుతో చనిపోయిందంటూ కుటుంబ సభ్యులను నమ్మించాలని చూశాడు. అయితే.. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి అతన్ని నిలదీయడంతో హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు నర్సింహులుని అదుపులోకి తీసుకున్నారు. భార్య హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read Also: Coimbatore: ప్రియుడితో లాడ్జికి వెళ్లిన యువతి.. కట్ చేస్తే శవంగా కనిపించింది..

ఈ క్రమంలో.. పోలీసుల ఎదుట నిందితుడు కొన్ని విషయాలను చెప్పాడు. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్టు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. భార్య ఇందిరాకి వివాహేతర సంబంధం ఉండటం వల్లే హత్య చేశానని చెప్పాడు. తాను లేనప్పుడు ఓ పోలీస్ అధికారి తరుచూ ఇంటికోవచ్చేవాడని చెబుతున్నాడు. అంతేకాకుండా.. గంటల తరబడి అతనితో ఫోన్ లో మాట్లాడేదని జోగిపేట పోలీసుల ముందు నర్సింహులు స్టేట్ మెంట్ ఇచ్చాడు. కాగా.. నిందితుడికి మృతురాలు మొదటి భార్య.. తనకు పిల్లలు పుట్టకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు నర్సింహులు. ఇద్దరు భార్యలతో కలిసి హైదరాబాద్ రాజేంద్రనగర్ లో నివాసం ఉంటున్నాడు.

Read Also: Ganesh Laddu: రికార్డు స్థాయి వేలం పలికిన వినాయకుని లడ్డు

Show comments