Billboard Collapse: ఎట్టకేలకు పట్టుబడ్డ హోర్డింగ్ యజమాని.. 3 రోజుల్లో 3 రాష్ట్రాలు తిరిగాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు. 16 మంది ప్రాణాలను బలిగొన్న ఆ హోర్డింగ్ పెట్టింది ఈగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని భవేశ్ భిండే 3 రోజులు మూడు రాష్ట్రాలు తిరిగాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ముప్పుతిప్పలు పడ్డాడు. ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. ఈ రోజు ఉదయ్‌పూర్‌లో అతడి పట్టుకున్నారు.
READ MORE: Viral Video : వామ్మో.. ఇదేం డ్యాన్స్ రా నాయనా.. చూస్తే ఫ్యాంట్ తడిచిపోవాల్సిందే..
Also Read
కాగా. ఇటీవల ముంబైలో గాలివానలకు120 ఫీట్ల ఎత్తున్న బిల్‌బోర్డు కూలడం వల్ల 16 మంది మృతిచెందగా, మరో 75 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన రోజే ఆ హోర్డింగ్ ఓనర్ పరారీ అయ్యాడు. భవేశ్ గురించి ముంబై పోలీసులు వెతకడం మొదలు పెట్టారు. ఎనిమిది బృందాలు అతడి కోసం అన్వేషణ మొదలు పెట్టాయి. ఉదయ్‌పూర్‌లో ఉన్నట్లు తెలుసుకుని ఓ ఆపరేషన్ చేపట్టారు. స్థానిక పోలీసులకు చెప్పకుండానే వాళ్లు భవేశ్‌ను ఆధీనంలోకి తీసుకునేందుకు పూనుకున్నారు. చివరకు వారికి ఫలితం లభించింది. ఆ యజమాని పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తొలుత లోనావాలా వెళ్లాడు. అక్కడ నుంచి థానే. ఆ తర్వాత అహ్మాదాబాద్ వెళ్లాడు. మళ్లీ అక్కడ నుంచి అతను ఉదయ్‌పూర్ చేరుకున్నాడు. అక్కడ ఓ హోటల్లో అతను మరో పేరుతో దాక్కుకున్నట్లు గుర్తించారు. ఆచూకీ తెలుసుకుని వెళ్లేలోగా.. అతను కొత్త సిటీకి పరారీ అయ్యేవాడు. భవేశ్‌ను పట్టుకునేందుకు ముంబై పోలీసులు 8 బృందాలుగా ఏర్పడగా.. చివరకు క్రైం బ్రాంచ్ పోలీసులకు అతను చిక్కాడు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కోర్టుకో అప్పగించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!