Bangladesh Crises: భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌లు నిర్వహించొద్దు- హిందూ మహాసభ
- 14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌లో బంగ్లాదేశ్-భారత్‌ల మధ్య అంతర్జాతీయ టీ20 మ్యాచ్
- గ్వాలియర్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య అంతర్జాతీయ మ్యాచ్‌ను..
- నిర్వహించేందుకు అనుమతించబోం- హిందూ మహాసభ
- గ్వాలియర్ వీధుల్లో నిరసనలు తెలుపుతూ స్టేడియంలోని పిచ్‌ను తవ్వుతాం- హిందూ మహాసభ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌లో బంగ్లాదేశ్-భారత్‌ల మధ్య అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి. గ్వాలియర్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించేందుకు అనుమతించబోమని హిందూ మహాసభ ప్రకటించింది. గ్వాలియర్ వీధుల్లో నిరసనలు తెలుపుతూ స్టేడియంలోని పిచ్‌ను తవ్వుతామన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై ఊచకోతకు పాల్పడుతున్నారని హిందూ మహాసభ పేర్కొంది. హిందువుల ఇళ్లు, దేవాలయాలకు నిప్పు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. హిందూ మహిళలను కూడా హింసిస్తున్నారని వారు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో బంగ్లాదేశ్ మ్యాచ్‌లు ఆడడం హిందువులకు ద్రోహం అని అన్నారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అంటే అస్సలు సహించేది లేదని.. బంగ్లాదేశ్ జట్టును గ్వాలియర్‌కు రాణించొద్దని హిందూ మహాసభ పేర్కొంది.
Samantha: సమంత సీక్రెట్ డేటింగ్.. అతని బ్యాక్ గ్రౌండ్ ఇదే!
Also Read
- Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
గ్వాలియర్‌లో జరగనున్న బంగ్లాదేశ్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ను రద్దు చేసేందుకు ప్రధాని మోడీకి 15 రోజుల సమయం ఇస్తున్నామని హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ అన్నారు. బంగ్లాదేశ్ మ్యాచ్ గ్వాలియర్‌లో జరిగితే మతపరమైన వాతావరణం మరింత దిగజారుతుందని తెలిపారు. బంగ్లాదేశ్ జట్టు ఇక్కడ మ్యాచ్ ఆడితే నల్లజెండాలతో నిరసన తెలపడంతో పాటు మ్యాచ్ జరిగే పిచ్‌ను కూడా తవ్వుతామని హెచ్చరించారు.
Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024 స్క్వాడ్స్ ప్రకటన.. కెప్టెన్స్ వీళ్లే..!
అక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగనున్న టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ షెడ్యూల్ విడుదల కావడం గమనార్హం. ఈరోజు GDCA వైస్ ప్రెసిడెంట్ మహాన్ ఆర్యమాన్ సింధియా మాట్లాడుతూ.. ‘గ్వాలియర్‌కు ఇది ఒక పెద్ద విజయం. మా తాతయ్య కల నెరవేరబోతోంది. మధ్యప్రదేశ్‌లో క్రికెట్‌ను ఎలా ప్రోత్సహించాలనే దానిపై మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. దీని ఫలితంగానే 14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది.’ అని తెలిపారు. కాగా.. 2010లో ఇక్కడ జరిగిన చివరగా సౌతాఫ్రికా-భారత్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ తొలి డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!