Samantha Rumoured Love Intrest Raj Nidimoru Back Ground: నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ వార్త మీడియాలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వేళ సమంతా కూడా ఎంగేజ్మెంట్ చేసుకుందనే ప్రచారం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసింద. బాలీవుడ్ మీడియా పోర్టల్స్ లో ఇదే విషయం ఎక్కువగా హైలైట్ అవుతుంది. సమంత ది ఫ్యామిలీ మెన్ సిరీస్ టు చేసిన దర్శకత్వయం రాజ్, డీకే లలో రాజ్ నిడుమోరుతో సమంత డేటింగ్ చేస్తోందని చాలా కాలం నుంచి బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నిన్న ఏకంగా వీరిద్దరూ డేటింగ్ దశ దాటి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సందర్భంగా రాజ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఆయన గతంలో ఏం చేసేవాడు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజ్ కి ఇప్పటికే వివాహం అయింది. సమంత ప్రేమ నేపథ్యంలో మొదటి భార్యకు విడాకులు ఇస్తున్నాడని ప్రచారం కూడా జరుగుతోంది. భారత సంతతికి చెందిన రాజు నిడుమోరు యూఎస్ బేస్డ్ ఫిలిం మేకర్ గా పేరు తెచ్చుకున్నాడు.
Chiyan Vikram: తంగలాన్ లో రెండు క్యారెక్టర్స్ చేశా.. తన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది: విక్రమ్ ఇంటర్వ్యూ
తన స్నేహితుడు కృష్ణ డికెతో కలిసి ఆయన ఎక్కువగా సినిమాలు చేస్తూ వచ్చాడు. రాజు చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించాడు. ఎస్వియు ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసి పై చదువులు కోసం అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. సినిమాల మీద ప్యాషన్ తో షాదీ డాట్ కామ్ అనే ఒక షార్ట్ ఫిలింతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ కథలను ఆధారంగా చేసుకుని ఫ్లేవర్స్ అనే ఒక సినిమా చేశారు. ఇక ఆ తర్వాత 99 అనే ఒక హిందీ సినిమాతో వీరు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎన్ని సినిమాలు చేసిన వీరికి రాని గుర్తింపు ది ఫ్యామిలీ మెన్ సిరీస్ తో వచ్చేసింది. ఆ సిరీస్ కి కొనసాగింపుగా సెకండ్ సీజన్ కూడా చేశారు. ఇక 2023లో ఫర్ ది గన్స్ అండ్ గులాబ్స్ వంటి సిరీస్ లు కూడా చేశారు. ఇక ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో వీరు చేసిన సిటాడిల్ హనీ బన్నీ అనే సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.