Site icon NTV Telugu

AP High Court: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలపై విచారణ పూర్తి..

Ap High Court

Ap High Court

AP High Court: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌పై స్టే విధించాలని కోరూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారణ పూర్తి అయ్యింది.. పోలింగ్ చట్ట విరుద్ధంగా అప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్లు.. ఉప ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన చేసి పోలింగ్ ను అధికార పార్టీ నాయకులు చేయించారని కోర్టుకు తెలిపారు.. దీంతో, పోలింగ్ ప్రక్రియపై స్టే ఇచ్చి రీ పోలింగ్ ను కేంద్ర భద్రతా బలగాల సమక్షంలో నిర్వహించాలని వాదించారు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు.. మరోవైపు, పోలింగ్ పూర్తై, కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్నికల ప్రక్రియలో కోర్టు జోక్యం ఉండదని పలు జడ్జిమెంట్లను కోర్టు దృష్టికి తీసుకువచ్చింది ప్రభుత్వం.. ఈ వ్యవహారంపై ఇరు వర్గాల వాదనలు పూర్తి అయ్యాయి.. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత తీర్పు వెలువరించనుంది ఆంధ్రప్రదేశ్‌ న్యాయస్థానం..

Read Also: Speaker Ayyanna Patrudu: మీరు అసెంబ్లీకి వస్తారా..? రారా? క్లారిటీ ఇవ్వండి.. ప్రశ్నలు మురిగిపోతున్నాయి..

కాగా, ఇప్పటికే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించగా.. వైసీపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.. మరోవైపు, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాల్లోనూ టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.. మరి, కాసేపట్లో ఆ ఫలితం కూడా వెలువడనుండగా.. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ తీర్పు ఉత్కంఠగా మారింది..

Exit mobile version