పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌పై స్టే విధించాలని కోరూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ పూర్తి అయ్యింది.. పోలింగ్ చట్ట విరుద్ధంగా అప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్లు.. ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన చేసి పోలింగ్ ను అధికార పార్టీ నాయకులు చేయించారని కోర్టుకు తెలిపారు..
కడప జిల్లాలో ఆసక్తికరంగా మారిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నేడు ఫలితాలు తెలిపోనున్నాయి.. కడప రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.. జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది..