NTV Telugu Site icon

MJPJAY: మహారాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం శుభవార్త.. ఇక నుంచి ఆ పథకం అందరికీ

Maharastra

Maharastra

మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. నూతన ఆరోగ్య బీమా పథకం.. మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్ ఆరోగ్య అభియాన్ (MJPJAY)ని ప్రతి ఒక్కరికీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఈ పథకం వార్షిక ప్రీమియంను 60% పెంచి రూ.3,000 కోట్లకు పైగా పెంచింది. జూలై 1 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది. కొత్త ఆరోగ్య బీమా పథకం కింద.. రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు 1.5 లక్షలకు బదులుగా మొత్తం రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఈ పథకాన్ని 2012లో ప్రారంభించారు.

India-Ukraine: ఉక్రెయిన్‌కు మద్దతుగా సంతకం చేయని భారత్.. కారణమేంటంటే..!

ఈ పథకానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఖరారు చేసింది. ఇందుకోసం ప్రభుత్వ రంగ బీమా సంస్థ యునైటెడ్ ఇండియా అస్యూరెన్స్‌ను ఎంపిక చేసింది. రాష్ట్రంలోని 12.3 కోట్ల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.1300 చొప్పున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2023-24లో 5.7 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నాయి. కొత్త పథకం అమలుకు ముందు.. బీమా చేసిన వ్యక్తి దాని ప్రయోజనాలను పొందేందుకు రూ. 1 లక్ష వరకు వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అందించాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం దానిని తొలగించి పౌరులందరికీ సమానంగా అమలు చేసింది. ఇప్పుడు ఆదాయానికి కూడా పరిమితి లేదు. ఈ పథకం కింద గతంలో 1000 ఆసుపత్రులను ఎంప్యానెల్ చేయగా ఇప్పుడు 1900 ఆసుపత్రులకు పెంచారు.

Vijay Sethupathi: హిట్ కొట్టగానే డైరెక్టర్ మారిపోయాడు.. 33 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు!

గత ఏడాది జూన్‌లో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎంజేపీజేఏవై (MJPJAY) బీమా మొత్తాన్ని రూ. 1.5 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ అది అమలు కాలేదు. కాగా.. లోక్‌సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వం దీనిని అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగియడంతో ప్రభుత్వం దానిని ఖరారు చేయడం ప్రారంభించింది. ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ పథకం జూలై 1 నుండి కొత్త రూపంలో ప్రారంభించబడనుంది.