RTC Bus: పరిహారం చెల్లించకపోవడంతో ఆర్టీసీ బస్ సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTC Bus: తమిళనాడు రాష్ట్రంలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. కోయంబత్తూరులో ప్రమాదానికి కారణమై పూర్తి పరిహారం చెల్లించకపోవడంతో రెండోసారి ప్రభుత్వ బస్సును సీజ్ చేశారు. కోయంబత్తూరు పొల్లాచ్చి జమీన్ ఉత్తుకుళికి చెందిన మహాలింగం. ఇతని కుమారుడు సతీష్ (24). బీఏ పట్టభద్రుడైన అతడు కోయంబత్తూరులోని శరవణంపట్టి ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2018లో ఉక్కడం సిగ్నల్ దగ్గర బైక్ పై వెళుతుండగా సతీష్ వెనుకే వస్తున్న ప్రభుత్వ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో, సతీష్ కుటుంబం నష్టపరిహారం కోరుతూ కోయంబత్తూరు జిల్లా అదనపు కోర్టులో కేసు వేసింది. 2019లో కేసును విచారించిన న్యాయమూర్తి సతీష్ కుటుంబానికి రూ.12 లక్షల ప్రమాద పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
Read Also: Love Marriage : బిడ్డ టీచరు.. తండ్రి ప్రొఫెసర్.. పరువు పోతుందని అంత పని చేశాడు
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
కానీ తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థ ప్రమాదానికి తగిన పరిహారం ఇవ్వకపోవడంతో వడ్డీతో కలిపి 16 లక్షలు చెల్లించాలని మళ్లీ కోర్టులో కేసు వేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి బాధితురాలి కుటుంబానికి రూ.16 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. పరిహారం చెల్లించకపోవడంతో గత జనవరిలో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ బస్సును సీజ్ చేశారు. ఈ కేసులో రాష్ట్ర రవాణా సంస్థ అధికారులు 7.40 లక్షల పరిహారం చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని నెల రోజుల్లో చెల్లిస్తామని రవాణా సంస్థ అధికారులు తెలిపారు. అయితే నెల రోజులు గడుస్తున్నా సొమ్ము చెల్లించకపోవడంతో మళ్లీ రెండోసారి అదే ప్రభుత్వ బస్సును సీజ్ చేయడం గమనార్హం.
Read Also: Drugs Price : ఫార్మా కంపెనీల ‘మందు’పాతర.. ఏప్రిల్ 1న విడుదల
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..