వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. 339 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. కాగా.. ఆట ముగిసే సమయానికి క్రీజులో క్రావ్లే (29), రెహాన్ అహ్మద్(9) పరుగులతో ఉన్నారు. ఓపెనర్ బెన్ డకెట్ వికెట్‌ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీశాడు. వ్యక్తిగత స్కోరు 28 పరుగుల వద్ద కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అయితే ఇంగ్లండ్ ఈ టెస్ట్ లో గెలువాలంటే.. 332 పరుగులు చేయాల్సి ఉంది. అంతేకాకుండా.. ఆట ఇంకో 2 రోజులు మిగిలివుండగా ఆ పరుగులు చేయాల్సి ఉంది. అటు.. భారత్ గెలవాలంటే 9 వికెట్లు తీయాలి. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 255 పరుగులకు చేసి.. ఇంగ్లండ్ ముందు 398 పరుగుల ఆధిక్యాన్ని ఉంచింది. 399 పరుగుల విజయలక్ష్యంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించింది.
Minister Venu: అన్నయ్య మూసేస్తే తమ్ముడొచ్చాడు.. మంత్రి తీవ్ర విమర్శలు..
ఈరోజు ఆటలో వన్డౌన్ బ్యాట్స్మెన్గా బరిలోకి దిగిన శుభ్మాన్ గిల్ సెంచరీ (104) చేసి జట్టుకు ఆధిక్యాన్ని పెంచాడు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన శ్రేయాస్ అయ్యర్ 29, రజత్ పాటిదర్, అక్షర్ పటేల్ 45, శ్రీకర్ భరత్ 6, అశ్విన్ 29, కుల్దీప్, బుమ్రా డకౌట్ గా పెవిలియన్ బాట పట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్ నైట్ 28/0 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ వరుస ఓవర్లలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (17), రోహిత్ శర్మ (13)ను ఔట్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 4 వికెట్లతో చెలరేగగా..రెహన్ అహ్మద్ 3, జేమ్స్ అండర్సన్ 2, బషీర్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు, ఇంగ్లండ్ 253 పరుగులకు ఆలౌట్ అయింది.
Ram Mandir: రామ మందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మణిశంకర్ అయ్యర్ కుమార్తెపై కేసు..