వరల్డ్ కప్ 2023లో భాగంగా నిన్న భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా.. మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 398 పరుగుల భారీ స్కోరును చేసింది టీమిండియా.. ఈ క్రమంలో కివీస్ పై 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో కొత్త వివాదం వచ్చి పడింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడంటూ పాక్ మాజీ ఆటగాడు సికందర్ భక్త్ సంచలన ఆరోపణలు చేశాడు. టాస్ కోసం ఐసీసీ అధికారులు నాణెం అందించిన ప్రతిసారీ రోహిత్ దానిని దూరంగా పడేలా విసిరేశాడన్నారు. టాస్ వీడియోకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో చూపెట్టాడు.
Read Also: Hamas: హమాస్ బందీలను విడుదల చేస్తుంది.. థాయ్ రాజకీయ నేత కీలక వ్యాఖ్యలు..
రోహిత్ టాస్ వేస్తే.. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ తన చాయిస్ చెప్పాల్సి ఉంటుందని, వారు హెడ్స్ చెబితే టెయిల్, టెయిల్ చెబితే హెడ్స్ పడిందని ఐసీసీ అధికారులు చెప్పారన్నారని భక్త్ తెలిపాడు. కాయిన్ దూరంగా పడడంతో కెప్టెన్ కు అది చూడటానికి అవకాశం లేకుండా పోయిందని ఆరోపించాడు. అసలు కాయిన్ ను దూరంగా పడేలా చేయడమే ఫిక్సింగ్ కోసమని సికిందర్ భక్త్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Read Also: Sehar Shinwari: పాక్ నటిని ఏకిపారేస్తున్న ఇండియన్స్.. బాగా ఏడువు అంటూ కామెంట్స్
ఐసీసీ అధికారులు టీమిండియాకు సపోర్ట్ చేస్తారని, టాస్ విషయంలో ప్రత్యర్థి జట్టు కెప్టెన్ కు క్రాస్ చెక్ చేయకుండా చూసుకుంటే సరిపోతుందని రోహిత్ శర్మ ప్లాన్ చేశాడని అతను వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ టీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సికందర్ భక్త్ ఈ సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా.. రోహిత్ శర్మ టాస్ వేసిన వీడియోలను చూపెట్టాడు. అందులో రోహిత్ శర్మ పైకి విసిరిన ప్రతిసారీ కాయిన్ దూరంగా పడడం గమనించవచ్చు. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.