NTV Telugu Site icon

KTR: వాళ్ల ప్రియారిటీ ఫార్ములా- ఈ కేస్.. మా ప్రియారిటీ ఫార్మర్స్

Ktr

Ktr

రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలి సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కమిటీ సభ్యులు హాజరయ్యారు. రైతు ఆత్మహత్యలు, అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అమలుపై చర్చించారు. అంతేకాకుండా.. సంపూర్ణ రైతు రుణమాఫీ, యాసంగి పంటకు సాగునీరు, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న తదితర అంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ అధ్యయన కమిటీలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీలు ఎంసి కోటిరెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్య యాదవ్ ఉన్నారు.

Read Also: Viral Video: దెబ్బకు వైరల్‌ కావాలని.. పెదాలపై ఫెవిక్విక్ వేసుకున్న యువకుడు.. చివరికీ(వీడియో)

సమావేశం అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యలపై అధ్యయనం చేయాలని 9 మందితో కమిటీ వేశామన్నారు. ఈ నెల 24 నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలు పెట్టి నెల రోజుల పాటు అన్ని జిల్లాల్లో అధ్యయనం చేస్తారని తెలిపారు. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలుసుకుంటారు.. ఫిబ్రవరి ఆఖరి వారం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్‌కు ఈ నివేదిక ఇస్తారని చెప్పారు. మరోవైపు.. ఈ నెల 28న హైకోర్టు నల్గొండ దీక్షకు అనుమతి ఇచ్చింది.. న్యాయస్థానం చెప్పిన విధంగా శాంతి యుతంగా దీక్ష చేస్తామన్నారు. గ్రామ సభల్లో ప్రజలు అడిగిన దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రియారిటీ ఫార్ములా ఈ కేసు.. తమ ప్రియారిటీ ఫార్మర్స్ అని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుల్లో భరోసా నింపేందుకు ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని తెలిపారు.

Read Also: Minister Narayana: రాజధాని అమరావతికి మరో గుడ్ న్యూస్.. హడ్కో కీలక నిర్ణయం