రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలి సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన ఆయన నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. రైతు ఆత్మహత్యలు, అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అమలుపై చర్చించారు.
సత్తుపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును దగ్గర నుంచి గమనిస్తున్నాం.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు ఏమిటో నిన్నటి గ్రామసభలను చూస్తే తెలుస్తుందని అన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామ సభల్లో ప్రభుత్వాన్ని గ్యారంటీలపై నిలదీస్తున్నారని తెలిపారు.