NTV Telugu Site icon

BJP: టార్గెట్ 2024.. అప్పుడే బీజేపీ లోక్సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్..!

Bjp

Bjp

మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో తమ ప్రచార జోరును పెంచింది. అటు ప్రధాని మోడీ, నడ్డా, అమిత్ షా విజయం కోసం బలంగానే శ్రమిస్తున్నారు. అయితే మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు తమ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడదుల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా.. లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం.

Read Also: Boys Hostel : డిజిటల్ రైట్స్ పొందిన ప్రముఖ ఓటీటీ సంస్థ..?

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడకముందే లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ రిలీజ్ చేయనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మినీ జమిలి ఎన్నికలు జరగొచ్చని, లోక్‌సభకు డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు జరుగుతాయన్న చర్చలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది. మొదట దేశవ్యాప్తంగా 160 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ తొలి జాబితాలోనే తెలంగాణలోని 12 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయని, ఈ మేరకు పేర్లు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల అభ్యర్థులను ముందుగా ప్రకటించనున్నట్లు సమాచారం తెలుస్తోంది.

Read Also:MK Stalin: కేరళ ప్రజలకు ఓనం శుభాకాంక్షలు తెలిపిన MK స్టాలిన్

ఇప్పటికే మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇంకా రిలీజ్ కాకముందే.. తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయగా.. లోక్‌సభ ఎన్నికలకూ ముందస్తు అభ్యర్థుల ప్రకటన వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.