NTV Telugu Site icon

SP Goush Alam: ఆదిలాబాద్లో రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ జరపలేదు- జిల్లా ఎస్పీ

Adb Sp

Adb Sp

ఉదయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. డిమాండ్ రకం విత్తనాల కోసం జిల్లా నలుమూలల నుంచి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో.. రైతులు షాపుల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. తోపులాట జరగడంతో పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటనపై ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం స్పందించారు. ఆదిలాబాద్ లో పత్తి విత్తనాల కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారని, చదరగొట్టారన్నది అవాస్తవం అని అన్నారు.

WhatsAppUpdate: వాట్సప్ లో కొత్త అప్‌డేట్‌..ఇకపై ఒక నిమిషం వరకు అవకాశం

రైతుల బాగు కోసం ఎటువంటి అపాయం జరగకుండా, వారి క్షేమం కోసం సదుద్దేశంతో రైతులందరినీ ఒక క్రమబద్ధీకరణతో వరుస క్రమంలో ఏర్పాటు చేయడం కోసం పోలీసు సిబ్బంది బందోబస్తు విధులను నిర్వర్తిస్తుంటారని గ్రహించాలని ఎస్పీ తెలిపారు. దుకాణాల్లోకి దూసుకెల్లకుండా ప్రశాంతంగా రైతులను క్రమబద్ధీకరణలో వరుస క్రమంలో విత్తనాలను సేకరించి తిరిగి వెళుతున్నారని గ్రహించాలన్నారు. ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు ఆదిలాబాద్ లో ఏర్పడలేదని.. రైతులతో తీవ్ర వాగ్వాదం, తోపులాట అనేది జరగలేదన్నారు. పోలీసులు ఏ ఒక్క రైతుపై కూడా లాఠీచార్జ్ చేయడం జరగలేదని పేర్కొన్నారు. ఇలాంటి ఆందోళనకర అవాస్తవమైన, వార్తలను ప్రచురించి ప్రశాంతమైన రైతులకు ఇబ్బందికర పరిస్థితిని తీసుకురాకూడదని తెలిపారు. అవాస్తవమైన వార్తలను, స్క్రోలింగ్ లను ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Rahul Gandhi: ‘‘అందుకే ప్రధాని మోడీని దేవుడు పంపాడు.’’ రాహుల్ గాంధీ సెటైర్లు..

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం రైతులు పడే ఇబ్బందులపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావ్ స్పందించారు. పత్తి విత్తనాల కోసం వచ్చిన రైతుల పైన ఎలాంటి లాఠీ ఛార్జ్ జరగలేదన్నారు. విత్తనాల కోసం భారీగా రైతులు తరలి వచ్చింది వాస్తవమేనని.. రైతులు అధైర్య పడవద్దు.. ప్రతీ రైతుకు కావాల్సిన విత్తనాలను అందిస్తామని తెలిపారు. రైతుల పక్షాన నిలిచే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని అన్నారు. ప్రతీ రైతుకు పత్తి గింజలు అందిస్తామని.. రైతులపై లాఠీ ఛార్జ్ అంటూ కావాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం మాత్రమేనని ఆరోపించారు. విత్తనాల కోసం ఆందోళన పడాల్సిన పనిలేదు.. అందుబాటులో ఉన్నాయని ప్రేమ్సాగర్ రావ్ తెలిపారు.