ఉదయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. డిమాండ్ రకం విత్తనాల కోసం జిల్లా నలుమూలల నుంచి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో.. రైతులు షాపుల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. తోపులాట జరగడంతో పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటనపై ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం స్పందించారు. ఆదిలాబాద్ లో పత్తి విత్తనాల కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వచ్చిన…