Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News The Cm Gave Key Instructions To The Officials Of The Water Resources Department

CM Chandrababu: జల వనరుల శాఖ అధికారులకు సీఎం కీలక సూచనలు..కరవు పరిస్థితులను సైతం అధిగమించేలా చర్యలు

Published Date :August 7, 2024 , 7:39 am
By RAMAKRISHNA KENCHE
  • గోదావరి-కృష్ణా-పెన్నా.. వంశధార-నాగావళి నదుల అనుసంధానంతో కరవు అరికట్టవచ్చు
  • అన్ని రిజర్వాయర్లు.. మైనర్ ఇరిగేషన్ చెరువులను పూర్తిగా నీటితో నింపాలి
  • పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్ళాలి
  • డయాఫ్రం వాల్ ను రెండు సీజన్లలో పూర్తి చేసి వచ్చే జూన్ నాటికి సిద్ధం చేయాలి
  • నీటి వృధాను అరికట్టు చివరి ఎకరాకు సైతం సాగు నీరు అందించాలి
  • వెలుగొండ.. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్-1 త్వరగా పూర్తి చేయాలి
  • జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
CM Chandrababu:  జల వనరుల శాఖ అధికారులకు సీఎం కీలక సూచనలు..కరవు పరిస్థితులను సైతం అధిగమించేలా చర్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వస్తున్న వరద నీటిని వినియోగించుకుని రాష్ట్రంలోని అన్ని ప్రధాన రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ చెరువులను పూర్తిగా నీటితో నింపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జల వనరులు శాఖ అధికారులను ఆదేశించారు. నీటి వృధాను అరికట్టి ఆయకట్టులోని ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చూడాలని స్పష్టం చేశారు. కరవు పరిస్థితులను సైతం అధికమించేందుకు వీలుగా అన్ని రిజర్వాయర్లను, మైనర్ ఇరిగేషన్ చెరువులను నీటితో నింపాలన్నారు. జలవనరుల శాఖపై మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో ఉన్న నీటి లభ్యత, తదితర అంశాలపై జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ రిజర్వాయర్లు, ఇతర ప్రాజెక్టులకు ఎంత నీరు వచ్చి చేరింది, పూర్తి స్థాయిలో నిండక పోవడానికి గల కారణాలను క్షేత్ర స్థాయి నుండి విశ్లేషించుకోవాలని అధికారులకు సూచించారు.

READ MORE: IND vs GER: సెమీఫైనల్‌లో జర్మనీ చేతిలో ఓటమి.. కాంస్యం కోసం భారత్‌ పోరు!

రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా దెబ్బతిన్నడయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్నిరెండు సీజన్లలో పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. దీనిపై కేంద్రంతో తాను కూడా మాట్లాడతానని, అధికారులు కూడా ఢిల్లీ వెళ్ళి సంబంధిత అధికారులతో మాట్లాడాలని ఆదేశించారు. వెలుగొండ, చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్-1 పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

READ MORE:Pawan Kalyan: పవన్ బర్త్ డే కానుకగా సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న’OG’ టీమ్

గోదావరి-పెన్నా, వంశధార-నాగావళి నదుల అనుసంధాన ప్రకియను ముందుకు తీసుకువెళ్ళాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నదుల అనుసంధానంతో భవిష్యత్తులో నీటి ఎద్దడిని సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని అన్నారు. గోదావరి డెల్టా కంటే ముందుగా కృష్ణా డెల్టాలో వ్యవసాయ పనులు మొదలయ్యే విధంగా పూర్తి స్థాయిలో నీటిని అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు. పులిచింతల నీటిని అవసరాలకు వాడుకునేలా నీటి నిల్వ ఉంచాలని పేర్కొన్నారు. పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు రిజర్వాయర్ ను పూర్తిగా నింపాలని స్పష్టం చేశారు.

READ MORE:శ్రావణ బుధవారం నాడు ఈ స్తోత్రాలు వింటే లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణు మీ ఇంట తిష్టవేసి ఉంటారు

వర్షపాతం వివరాలను విశ్లేషించి ఒక కార్యాచరణతో ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మైక్రో, మ్యాక్రో స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసి నీటి వినియోగంలో పటిష్టమైన పాలసీని తీసుకురావాలని సూచించారు. దీనిలో సామాజిక వేత్తలు, విద్యార్ధులు, సాగునీటి నిపుణులను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. నీరు సులభంగా పారేందుకు కాలువలు, డ్రైన్లలో గల తూడు, గుర్రపు డెక్క వంటివి తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, రిజర్వాయర్ల పరిస్థితులు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సియంకు వివరించారు. ఇప్పటి వరకూ 64 శాతం రిజర్వాయర్లను నీటితో నింపినట్టు సీఎంకు వివరించారు. ఈసమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ప్రణాళికాశాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, సియం కార్యదర్శి ఎవి.రాజమౌళి, జల వనరుల శాఖ సలహాదారు, అధికారులు వెంకటేశ్వరరావు, లక్ష్మీ ప్రసాద్, సిఇలు, ఎస్ఇలు,ఈఈలు, తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM
  • cm chandrababu
  • gave key instructions
  • Officials
  • Water Resources Department

తాజావార్తలు

  • Hyderabad Police: ‘రీల్’ కోసం ‘రియల్’ గౌరవం కోల్పోకండి.. వారికి హైదరాబాద్ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్

  • CM Chandrababu Serious Warning: మంత్రులకు సీఎం సీరియస్‌ వార్నింగ్.. కీలక సమాచారం ఎలా లీక్‌ అయ్యింది..?

  • AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. 60కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..

  • Love Attack: కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి హత్య..

  • Thappad Gang: చీకట్లో బైక్‌పై వస్తారు.. చెంప పగులగొట్టి పోతారు.. “చెంపదెబ్బల ముఠా” హల్‌చల్

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions