NTV Telugu Site icon

AP NEWS: ఏపీకి డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులకు కేంద్రం ఝలక్..

Central

Central

వైసీపీ హయాంలో కేంద్రం నుంచి ఏపీకి డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులకు కేంద్రం ఝలక్ ఇస్తుంది. ఏపీ ప్రభుత్వ ఆమోదం లేకుండా మాతృ శాఖల్లో చేరడానికి వచ్చే అధికారులకు నో ఎంట్రీ బోర్డు పెడుతుంది. కేంద్ర సర్వీసుల నుంచి డెప్యూటేషన్ మీద వచ్చిన అధికారులను రిలీవ్ చేయొద్దని గతంలోనే సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, వీజీ వెంకట రెడ్డి, వాసుదేవ రెడ్డి వంటి ఉన్నతాధికారులపై అవినీతి అభియోగాలు ఉన్నాయి. సీఎం ఆదేశాలను బేఖాతరు చేస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో రిపోర్ట్ చేసేందుకు ఐఐఎస్ అధికారి తుమ్మా విజయకుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు.

Read Also: Strong Bones : వృద్ధాప్యం వరకు ఫిట్‌గా, ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..

ఈ క్రమంలో.. తుమ్మాను తిరిగి కేంద్ర సర్వీసులోకి తీసుకునేందుకు మాతృశాఖ నిరాకరించింది. చేసేది లేక ఏపీకి తిరుగుపయనమయ్యారు. కాగా.. జూన్ 9న తుమ్మా డిప్యుటేషన్ కాలపరిమితి ముగిసింది. ఐ అండ్ పీఆర్ కమిషనర్ గా తుమ్మా జరిపిన వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపనుంది.

Read Also: Bhubaneswar: తల్లి ముందే తండ్రిని చంపిన లా కాలేజీ ప్రొఫెసర్