NTV Telugu Site icon

Kolkata Doctor Murder: ‘రేపు బంద్ లేదు.. అందరూ ఆఫీసుకు రావాల్సిందే’.. ప్రభుత్వం అల్టిమేటం

Kolkata Govt

Kolkata Govt

ఆగస్ట్ 28న బిజెపి పిలుపునిచ్చిన 12 గంటల సమ్మెలో పాల్గొనవద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం ప్రజలను కోరింది. సమ్మె కారణంగా సాధారణ జనజీవనం దెబ్బతినకుండా పరిపాలన చూస్తుందని వెల్లడించింది. రాష్ట్ర సచివాలయం ‘నబ్బన’ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న నిరసనకారులపై పోలీసుల చర్యకు వ్యతిరేకంగా.. రేపు (ఆగస్టు 28) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చిందన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మమతా ప్రభుత్వం

READ MORE; Vijay Party: హీరో విజయ్ కి బిఎస్పి షాక్

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బందోపాధ్యాయ మాట్లాడుతూ.. ‘బుధవారం బంద్‌ను ప్రభుత్వం అనుమతించదు. ఇందులో పాల్గొనవద్దని ప్రజలను కోరుతున్నాం. సాధారణ జనజీవనం ప్రభావితం కాకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటాం.” అని పేర్కొన్నారు. దీని తరువాత, రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులందరూ బెంగాల్ బంద్‌లో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు మహిళా ట్రైనీ డాక్టర్‌కు న్యాయం చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫోరమ్ ఆగస్టు 28న కోల్‌కతాలో పెద్ద ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

READ MORE;Be Alert On Seasonal Diseases: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.. ఆరోగ్యంతో చెలగాటమాడితే సస్పెండ్

కాగా.. కోల్ కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం.. హత్య కేసుపై దేశ వ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న వేళ కోల్ కతా మాంత్రం అట్టుడికి పోతుంది. విద్యార్థులు మరోసారి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. పోలీసులు వారిపై లాఠీఛార్జి చేస్తున్నారు. ఘటనా స్థలానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతినిధులు బయలు దేరారు. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్, పార్టీ ప్రతినిధి బృందాన్ని కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. సుకాంత్ మజుందార్ నేతృత్వంలో కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వెలుపల బీజేపీ కార్యకర్తలు సమ్మెలో కూర్చున్నారు. నేటి ఘటనకు నిరసనగా రేపు 12 గంటలకు బెంగాల్ బంద్‌కు పిలుపునిస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగుతుంది.” అని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ వ్యాఖ్యానించారు.