కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై బెంగాల్‌లో కలకలం రేగుతోంది. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఆగస్ట్ 28న బిజెపి పిలుపునిచ్చిన 12 గంటల సమ్మెలో పాల్గొనవద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం ప్రజలను కోరింది. సమ్మె కారణంగా సాధారణ జనజీవనం దెబ్బతినకుండా పరిపాలన చూస్తుందని వెల్లడించింది.
కోల్ కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసుపై దేశ వ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న వేళ కోల్ కతా మాంత్రం అట్టుడికి పోతుంది. విద్యార్థులు మరోసారి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు.