Site icon NTV Telugu

AP Govt: ఆ అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Ap Govt

Ap Govt

ఏపీకి డెప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు ఇచ్చింది. కాగా.. తమను రిలీవ్ చేయాలంటూ డెప్యుటేషన్ పై వచ్చిన పలువురు అధికారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. ఏపీ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా గనుల శాఖ ఎండీ వీజీ వెంకటరెడ్డి సీఎస్ కు దరఖాస్తు చేశారు. అంతేకాకుండా.. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కూడా.. తనను తక్షణం బాధ్యతల నుంచి రీలీవ్ చేయాల్సిందిగా విన్నవించారు. మరోవైపు.. తన మాతృ శాఖకు రిలీవ్ చేయాల్సిందిగా ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి సీఎస్ ను కోరారు.

Read Also: Sanjay Raut: సీఎం యోగిపై ఒత్తిడి తెచ్చేందుకే ఫడ్నవీస్ రాజీనామా డ్రామా..

వీరితో పాటు.. ఏపీ నుంచి రీలీవ్ చేయాల్సిందిగా దరఖాస్తులు చేసుకున్న వారిలో ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. గతంలో డెప్యూటేషనుపై వచ్చిన అధికారులపై టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఈ క్రమంలో.. వారు రిలీవ్ చేయాల్సిందిగా సీఎస్ ను కోరుతున్నారు. కాగా.. తెలంగాణకు వెళ్లేందుకు ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు. రావత్ తో పాటు తెలంగాణకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారులు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఉన్నతాధికారులకెవరికీ సెలవులివ్వొద్దని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో.. ఇప్పటికే తన సెలవు ప్రతిపాదనను సీఐడీ చీఫ్ సంజయ్ వెనక్కు తీసుకున్నారు.

Read Also: IND vs IRE: తొలి మ్యాచ్లోనే చెలరేగిన టీమిండియా బౌలర్లు.. 96కే ఆలౌట్

Exit mobile version