Devara :మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాను అక్టోబర్ 10 న దసరా కానుకగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.ఈ సినిమా అనుకున్న సమయానికన్నా ముందుగానే థియేటర్స్ లోకి రానుందని సమాచారం.
Read Also :Manamey Twitter Review : శర్వానంద్ ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేసాడా..?
ఇదిలా ఉంటే రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దేవర చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు.”ఫియర్ సాంగ్” గా సాగె ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ సాంగ్ లో ఎన్టీఆర్ విజువల్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.తాజాగా స్టార్ యాక్టర్ అజయ్ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.ఈ సినిమా స్టోరీ పరంగానే కాకుండా ఎలివేషన్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది అని అజయ్ తెలిపారు.ఈ సినిమా ఈ ఏడాది రాబోయే సినిమాలలో కూడా ది బెస్ట్ మూవీగా నిలుస్తుంది అని అజయ్ తెలిపాడు.ప్రస్తుతం అజయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.