War 2 : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “వార్ 2 “.ఈ సినిమాను బ్రహ్మాస్త్ర మూవీ ఫేమ్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో వస్తున్న ఆరవ చిత్రం.వార్ 2 సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తోంది.ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు.ఎన్టీఆర్ ,హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ 2025 ఆగస్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది.
Read Also :Thandel : నాగ చైతన్య ‘తండేల్’ షూటింగ్ అప్డేట్ వైరల్..
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా ఎన్టీఆర్ ఎంతో పాపులర్ అయ్యారు.తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యారు.దీనితో వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉండనున్నట్లు సమాచారం.దీనికోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ ,హృతిక్ మధ్య భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఈ యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా వుంటాయని సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.జులై చివరి వారంలో అలియాభట్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం.