తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ మరోసారి నెట్టింట ట్రెండింగ్ లో నిలిచాడు.బుధవారం (జనవరి 10) అతడు ఫ్యాన్స్ తో దిగిన సెల్ఫీ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.తన నెక్ట్స్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ షూటింగ్ సందర్భంగా విజయ్ క్లీన్ షేవ్ లుక్ లో కనిపించాడు. తనను చూడటానికి వచ్చిన అభిమానులతో అతడు సెల్పీ దిగాడు.దళపతి విజయ్ మూవీ షూటింగ్ జరుగుతోందని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆ సెట్ దగ్గరికి వేలాదిగా తరలి వచ్చారు. తనను చూడటానికి వచ్చిన అభిమానులను నిరాశ పరచడం ఇష్టం లేక విజయ్ ఇలా సెల్ఫీ దిగాడు. ఈ సెల్ఫీని విజయ్ మేనేజర్ జగదీశ్ ట్విటర్ లో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ అయింది. నిజానికి నాలుగేళ్ల కిందట కూడా అతడు ఇలాగే ఫ్యాన్స్ తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించాడు.
2020లో మాస్టర్ మూవీ షూటింగ్ సందర్భంగా నేవెలిలో తనకోసం వచ్చిన ఫ్యాన్స్ తో విజయ్ సెల్ఫీ దిగాడు. అప్పట్లో అతనిపై ఐటీ దాడులు కూడా జరిగాయి. అయితే వీటి ద్వారా తన ఆత్మస్థైర్యం ఏమీ దెబ్బతినలేదన్నట్లు అభిమానులతో ఫొటోలకు పోజులిచ్చాడు. ఇక ఇప్పుడు క్లీన్ షేవ్ లుక్ లో విజయ్ కనిపించి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాడు.విజయ్ గతేడాది లియో మూవీ తో రూ.600 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి సూపర్ హిట్ అందుకున్నాడు.లియో మూవీని స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించాడు..అయితే మొదట లియో సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్మురేపిందని చెప్పొచ్చు.ఇక ఇప్పుడు విజయ్ వెంకట్ ప్రభు తో తొలిసారి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ చేస్తున్నాడు. సినిమా టైటిల్ తోనే సంచలనం రేపిన విజయ్.. ఇప్పుడు సరికొత్త లుక్ లో ఫ్యాన్స్ కు కనిపించి ఆశ్చర్య పరిచాడు