Thalapathy Vijay: దళపతి విజయ్ ఆస్తి లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అడుగు వేశారు. సోమవారం చెన్నైలోని పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన సమర్పించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. ఆయనకు రూ.404.58 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. ఇందులో బ్యాంక్ డిపాజిట్లు, వివిధ కంపెనీల్లో పెట్టుబడులతో పాటు విలాసవంతమైన కార్ల వివరాలను పేర్కొన్నారు.
READ ALSO: Interest Rates: SSY, PPF వడ్డీ రేట్లు ఖరారు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఏప్రిల్ 1 నుంచి అమలు..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
విజయ్ గ్యారేజీలో BMW 530, BMW i7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్‌ఫైర్ వంటి అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.237.46 కోట్ల ఆదాయాన్ని ప్రకటించగా, గత ఏడాది (2024-25) రూ.184.53 కోట్ల ఆదాయాన్ని చూపించారు. 2020-21లో ఆయన భార్య ఆదాయం రూ.6.13 లక్షలుగా ఉంది. నామినేషన్ అనంతరం విజయ్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అభ్యర్థులను గెలిపించాలని, ‘విజిల్’ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.
డీఎంకే మేనిఫెస్టో..
తమిళనాడులో ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ, అధికార డీఎంకే (DMK) పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రకటించిన ఈ మేనిఫెస్టోలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా ఒక భారీ స్కీమ్‌ను ప్రకటించారు. రాష్ట్రంలోని మహిళలకు రూ.8,000 విలువైన ప్రత్యేక కూపన్లను అందజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ మొత్తాన్ని నేరుగా నగదు రూపంలో ఇస్తే రోజువారీ ఖర్చులకే సరిపోతుందని, అందుకే కూపన్ల రూపంలో ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కూపన్ల ద్వారా మహిళలు తమకు నచ్చిన వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, టెలివిజన్లు లేదా మిక్సర్ల వంటి వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఎంట్రీతో ముక్కోణపు పోటీ నెలకుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక పక్క దళపతి ఆస్తుల లెక్కలు.. ఇటు అధికార పార్టీ ప్రకటించిన ఉచిత పథకాల ప్రకటనలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కిందని చెబుతున్నారు.
READ ALSO: Standing Exercises: జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇంట్లోనే బెల్లీ ఫ్యాట్‌కు బాయ్ బాయ్ చెప్పిండి..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!